అమరావతి ఆగష్టు 24
సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. మూడు ముక్కలాట ఆడే అధికారం ఎవరిచ్చారని, ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు సవాల్ విసిరారు. మీకు మెజార్టీ వస్తే మేం మాట్లాడం. ఆనాడు మీరు చెప్పి చేసి ఉంటే మేం మాట్లాడేవాళ్లం కాదు. ప్రజలను నమ్మించి ఎందుకు మోసం చేశారు. ఇది నయవంచన.. దగా.. మోసం. అధికారం వచ్చిందని ఇష్ట ప్రకారం చేస్తారా?. ఆంధ్రప్రదేశ్ కోసమే అమరావతి అని స్పష్టంగా చెప్పాం. విధ్వేషాలు రెచ్చగొట్టేలా అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు 251 రోజులుగా ఆందోళన చేస్తుంటే కనికరం లేదా?. రాజధానికి భూములు ఇస్తామని చెప్పడమే రైతులు చేసిన తప్పా?. అమరావతి రైతులపై ప్రభుత్వానికి ఎందకింత కక్ష అని చంద్రబాబు మండిపడ్డారు.