.పంచాయితీ రాజ్ వ్యవస్థలో ప్రక్షాళనకు ప్రయత్నిస్తున్న తెలంగాణ సర్కార్
500 జనాభా ఉన్న ప్రతి గ్రామాన్ని చిన్న పంచాయతీగా ఏర్పాటు
5లక్షలు తర్వాత స్థాయికి 10లక్షలు,15లక్షలు,20లక్షలు,25లక్షలు నిధులు ఇస్తామని సీయం హామీ
...మార్చ్ 12 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు
,ఈ దిశలో కీలకమైన సంస్కరణలు తెచ్చేందుకు సిద్ధమైంది.ఈ మేరకు సర్పంచ్ గా ఎన్నిక కావాలంటే వార్డు సభ్యుడు గా ఎన్నికై ఉండాలనే నిబంధనతో పంచాయితీ రాజ్ చట్టానికి సవరణలు చేయాలని భావిస్తోంది.ఈ చట్టం ప్రకారం పరోక్ష విధానంలో ఎన్నిక నిర్వహించాలా లేక ప్రత్యక్షంగా నిర్వహించేలా అని చర్చిస్తున్నారు..ఇదే సమయంలో ఒక వ్యక్తి ఒక వార్డు నుంచి మాత్రమే పోటీ చేయాలని నిబంధన కూడా పొందుపరచనుంది. సర్పంచ్ కి సలహాలు సూచనలు ఇచ్చేందుకు కొత్తగా ఓ కార్యనిర్వాహక కమిటీని ప్రభుత్వం నియమించే విధంగా పంచాయతీ రాజ్ చట్టనికి సవరణలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.విధి నిర్వహణలో సర్పంచ్ విఫలమయ్యారని భావిస్తే,పదవి నుంచి తొలగించే విధంగా సిపారస్సు చేసే అధికారాన్ని కార్యనిర్వహన కమిటీకి కట్టబెట్టేనున్నారు. ఇదే సమయంలో కొత్త చట్టం కింద సర్పంచ్ లకు విశేష అధికారాలు కల్పించనుండగా,శుభ్రత, పరిశుభ్రత,పచ్చదనం కాపాడే భాధ్యతలు వారికి అప్పగించనున్నారు.రాష్ట్ర బడ్జెట్ లొనే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించనుండగా,నిధులు విధులు సహా,భాద్యతలపై కొత్త చట్టంలో స్పష్టంగా నిర్వచించనున్నారు.స్థానిక పోలీస్ సబ్ ఇంస్పెక్టర్ కచ్చితంగా సర్పంచ్ ఆదేశాలను పాటించే విధంగా నిబంధనలు పొందుపరచనున్నారు. ప్రభుత్వ భూములను ఎవరైనా అక్రమిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి అవకాశం సర్పంచ్ లకు కల్పిస్తారు.ఇదే సమయంలో సర్పంచ్, ఉప సర్పంచ్ లు తమ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని భావిస్తే,ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టె అవకాశాన్ని కల్పించనున్నారు.మరో వైపు సర్పంచ్ తన విధులను నిర్వర్తించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావించిన వెంటనే పదవి నుంచి తొలగించే అధికారాన్ని కొత్త చట్టం కట్టబెడుతోంది.అటు సర్పంచ్, వార్డు సభ్యులపై పోలీసులకు నేరుగా కేసు నమోదు చేసే అవకాశం లేకుండా ముసాయిదా చట్టలో నిబంధన పెట్టారు.ముందుగా నోటీసు ఇచ్చిన తర్వాతే కేసు నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.విదంగా చట్టాన్ని సవరించేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్ధమైంది......