హైద్రాబాద్, ఆగస్టు 24
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సంచలన కేసు నమోదైన సంగతి తెలిసిందే. 139 మంది తనపై అత్యాచారం చేశారని ఓ పాతికేళ్ల యువతి ఈ కేసు పెట్టింది. దీని ప్రకారం పోలీసులు 139 మందిని ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. అయితే, ఈ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అమ్మాయిని ఎక్కడెక్కడ ఏయే ప్రాంతాల్లో ఆ నిందితులు బలాత్కారం చేశారనేదానిపై పోలీసులు దృష్టిపెట్టారు. మొదటిసారి ఎక్కడ అన్యాయానికి గురి అయిందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.బాధిత మహిళ పదో తరగతి పాస్ కాగానే కుటుంబ సభ్యులు వివాహం చేశారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకి బాధిత మహిళ వివాహం చేసుకుని వచ్చింది. అయితే అక్కడే మొదటిసారి అత్యాచారానికి గురయింది. భర్తతో కాపురం చేస్తున్న సమయంలో మామ బాధిత మహిళపై అత్యాచారం చేశాడు. అయితే ఈ విషయాన్ని భర్తకు చెబితే పట్టించుకోలేదు. ఆ తర్వాత భర్త సోదరులు కూడా బాధిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో పాటుగా మరో ఇద్దరు కూడా మహిళపై అత్యాచారం చేశారు. వీళ్ళ అఘాయిత్యాలను భరించలేక మహిళల విడాకులు తీసుకుంది. తిరిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది.మళ్లీ అక్కడ తిరిగి చదువు ప్రారంభించిన సమయంలో సుమన్ అనే విద్యార్థి సంఘం నాయకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో సుమన్‌తో పాటు బాధిత మహిళ హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడికి చేరుకున్న తర్వాత మహిళపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. బాధిత మహిళను నమ్మించి సుమన్ దేశంలోని పలు ప్రాంతాలు తిప్పాడు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, కోలకతా, నాగ్‌పూర్, పుణె లాంటి ప్రదేశాలకు తీసుకువెళ్ళాడు. అక్కడ తన ఫ్రెండ్స్‌తో బాధిత మహిళపై రేప్ చేయించాడు. కొన్ని సందర్భాల్లో మెడపై కత్తి పెట్టి రేప్ చేశారు. మరికొన్ని సమయాల్లో బాధిత మహిళతో సెక్స్ చేస్తున్న సమయంలో వీడియో తీశారు. నగ్నంగా ఫోటోలు కూడా తీశారు.ఇలా దేశవ్యాప్తంగా మహిళను పలు ప్రాంతాలకు తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే, ఈ కేసు మొత్తానికి మూల కారణం సుమన్ కావడంతో ప్రస్తుతానికి అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2011 నుంచి ఇప్పటివరకు 139 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పంజాగుట్ట పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. కొన్ని సందర్భాల్లో తనపై గ్యాంగ్ రేప్‌లు కూడా జరిగాయని పేర్కొంది. మరోవైపు కొన్ని సందర్భాల్లో వీడియోలు చూసి ఫొటోలు తీసి వేధింపులకు పాల్పడ్డారని చెప్పింది. అయితే వీటన్నిటి మీద సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన 139 మంది రేప్ చేశారనే విషయం ఇపుడు సమగ్ర దర్యాప్తునకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అత్యాచారానికి గురైన మహిళ కొన్నాళ్లపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పని చేసింది. పలు టీవీ సీరియళ్లతో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఈ నేపథ్యంలో పలువురు సినిమా నటులతో పాటు టీవీ ఆర్టిస్టులతో కూడా బాధిత మహిళకు పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాలతోనే బాధిత మహిళపైన అత్యాచారానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరెవరు ఎక్కడ తనపై అత్యాచారం చేశారనే విషయాన్ని సమగ్ర సమాచారంతో పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.