YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఎవరైనా లంచం తీసుకుంటే!

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఎవరైనా లంచం తీసుకుంటే!

విజయవాడ, ఆగస్టు 24 
అవినీతిని నిరోధించడానికి జగన్ సర్కార్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అవినీతి నిరోధం, ప్రభుత్వ చర్యలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ డీజీపీ ఎస్‌ ఆర్‌ ఆంజనేయలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఐఐఎం అహ్మదాబాద్‌ ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఇకపై లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని భావిస్తున్నారు. ‘దిశ’ తరహాలో అసెంబ్లీలో బిల్లు పెట్టే దిశగా ఆలోచన చేస్తున్నారు.1902 నెంబర్‌కు వచ్చే అవినీతి సంబంధిత అంశాలూ ఏసీబీకి చెందిన 14400కు బదలాయించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు అనుసంధానం చేయనున్నారు. ఇటు ఎమ్మార్వో, ఎండీవో, సబ్‌ రిజిస్ట్రార్, మున్సిపల్, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో అవినీతిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్‌ టెండరింగ్‌చేయాలని.. టెండర్‌ విలువ రూ.కోటి దాటితే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాల్సిందేనని తేల్చారు. అలాగే కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్‌ ప్రాజెక్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టుల విషయాల్లో గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా స్పష్టమైందని అంటున్నారు. అవినీతికి సంబంధించిన చట్టంపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Related Posts