YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆందోళనకు దిగిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి

ఆందోళనకు దిగిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి

హైద్రాబాద్, ఆగస్టు 24 
ఖైరతాబాద్ వినాయకుడి వద్ద నిరసనకు దిగింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. ప్రభుత్వం కరోన సాకుతో గణేష్ ఉత్సవాలకు అడ్డంకులు సృష్టిస్తుందని సమితి సభ్యులు ఆరోపించారు. దేశం మొత్తం గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని గణేశ్ ఉత్సవాలను ఆటంకాలు కల్గిస్తుందని విమర్శలు చేశారు. గ్రామాల్లో సైతం టీఆర్ఎస్ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్ల జెండలతో ఆందోళనకు దిగారు ఉత్సవ సమితి సభ్యులు. హిందూ వ్యతిరేక చర్యలకు తగిన బుద్ధి చెపుతామన్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు బాగవంత్ రావు.ఆదివారం కూడా ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద భజరంగదళ్ కార్యకర్తలు నిరసనకు దిగారు. కరోన కారణంగా సాధారణ భక్తులకు అనుమతి లేదన్నారు. రోడ్డుమీద నుంచి మాత్రమే దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. అయితే ఇందులో భాగంగానే బయటి నుంచే తాళ్లు కట్టి వెలుపలే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. దీంతో కమిటీ సభ్యుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భజరంగ్ దళ్ సభ్యులు ఆందోళనకు దిగారు. గణపతి విగ్రహానికి అడ్డంగా పరదా కట్టొద్దని నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.భాగ్యనగరానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఖైరతాబాద్‌లో ఈసారి 9 అడుగుల గణనాథుడు కొలువుతీరాడు. కరోనా వైరస్ కారణంగా ఈసారి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అయితే చరిత్రలో మొట్టమొదటి సారిగా గణపతి పండగపై కరోనా ఆంక్షలు విధించాల్సి వచ్చింది. ఈసారి 9 అడుగుల విగ్రహం మాత్రమే ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనం కూడా అక్కడే చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు

Related Posts