YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కాంగ్రెస్ లో కల్లోలం

కాంగ్రెస్ లో కల్లోలం

న్యూఢిల్లీ, ఆగస్టు 24
సీడబ్ల్యూసీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సోనియా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సమయంలో పార్టీ నేతలు ఎందుకు లేఖ రాశారని దుయ్యబట్టిన విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో లేఖ రాయడం సరికాదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాహుల్.. బీజేపీతో కుమ్మక్కయి, లేఖ రాశారని రాహుల్ ఆరోపించారు.పార్టీ అంతర్గత విషయాలపై నేతలు బహిరంగంగా మాట్లాడటంపై మండిపడ్డ ఆయన.. ఇది సీడబ్ల్యూసీ, చర్చించడానికి ఇది మీడియా కాదని వ్యాఖ్యానించారు.రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలోనే సోనియా గాంధీకి లేఖ రాయడం ఏంటని ప్రశ్నించారు. సమయం, సందర్భం లేకుండా లేఖ రాయడం ఏంటని నిలదీశారు. సీడబ్ల్యూసీ సభ్యుల ప్రోద్భలంతోనే అధ్యక్ష బాధ్యతలను చేపట్టడానికి సోనియా గాంధీ సముఖత వ్యక్తం చేశారన్నారు. సంక్షోభ సమయంలో లేఖ రాయడం అవసరమా? అని వ్యాఖ్యానించారు.కాగా, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కపిల్ సిబాల్, గులాం నబీ ఆజాద్‌లు తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆజాద్ తప్పుబట్టారు. బీజేపీతో చేతులు కలిపి సోనియా గాంధీకి లేఖ రాసినట్టు నిరూపిస్తే పార్టీకి తాను రాజీనామా చేస్తానని ఉద్ఘాటించారు. తాను ఎప్పుడూ పార్టీకి విధేయుడిగానే ఉన్నానని అన్నారు.ట్విట్టర్‌లో స్పందించిన మరో నేత కపిల్ సిబల్.. ‘తాము బీజేపీతో కుమ్మక్కయినట్టు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం బాధాకరం.. ఈ 30 ఏళ్లలో ఎప్పుడూ బీజేపీకి అనుకూలంగా మాట్లాడలేదు.. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కాపాడటానికి హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిచాం.. మణిపూర్‌లో బీజేపీని గద్దె దింపడానికి కాంగ్రెస్‌ పక్షాన పోరాడం.. ఇన్ని చేసినా బీజేపీతో చేతులు కలిపామని రాహుల్ వ్యాఖ్యానించడం బాధాకరం’ అని పేర్కొన్నారు
.

Related Posts