విజయవాడ, ఆగస్టు 24
సెప్టెంబర్ 3న మంత్రి వర్గం భేటీ కాబోతుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ప్రతి నెలలో 15 రోజులకు ఒకసారి.. 2, 4 బుధవారాల్లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.ఏపీ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 3న మంత్రి వర్గం భేటీ కాబోతుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఇటు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైకేబినెట్ మీటింగ్‌లో చర్చించబోతున్నారని తెలుస్తోంది. ఎజెండాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రతి నెలలో కేబినెట్ సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి నెలలో 15 రోజులకు ఒకసారి.. 2, 4 బుధవారాల్లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఒకవేళ బుధవారం సెలవు వస్తే.. మరుసటి రోజు సమావేశం ఉంటుంది. పరిస్థితిని బట్టి అటూ ఇటుగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు ప్రతి కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశానికి ముందు ప్రతి శాఖ సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటారు. ప్రతి నెలా ఒకటి, మూడు శనివారాల్లో (కేబినెట్ భేటీకి మూడు రోజుల ముందుగానే) శాఖల వారీగా ప్రతిపాదనలు పంపిస్తున్నారు.