YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గల్లా కనిపించకుండా పోయారే..

 గల్లా  కనిపించకుండా పోయారే..

గుంటూరు, ఆగస్టు 25, 
తెలుగుదేశం పార్టిని కష్టసమయంలో మోయాల్సిన వాళ్లు పత్తా లేకుండా పోతున్నారు. క్లిష్ట సమయంలో గళం విన్పించాల్సిన నేతలు మౌనం వహిస్తున్నారు. వారిలో గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ ఒకరు. గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. గుంటూరులోనూ లేరు. కరోనా సమయంలో ఆయన కన్పించడం లేదని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు రాజధాని అమరావతి తరలింపు హాట్ హాట్ గా సాగుతున్న వేళ ఎంపీ గల్లా జయదేవ్ గాయబ్ అయ్యారన్న ప్రచారం సాగుతోంది.గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ గత రెండు నెలలుగా పార్టీ నేతలకు, ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా విజయం సాధించారు. గల్లాజయదేవ్ కు తొలి నుంచి విజిటింగ్ ఎంపీగానే పేరుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ఆయనను చంద్రబాబు పిలిచి క్లాస్ పీకారన్న వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి.ప్పుడు పూర్తిగా విపక్షంలో ఉండటంలో పనిలేదనుకున్నారో? ఏమో గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంటు నియోకవర్గాన్ని పట్టించుకోలేదు. గుంటూరులో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బతింది. దీంతో పార్టీ క్యాడర్ గెలిచిన ఎంపీ గల్లా జయదేవ్ పై ఆశలు పెట్టుకుంది. గుంటూరులో గల్లా జయదేవ్ కార్యాలయం తెరచి ఉన్నప్పటికీ ఆయన మాత్రం అందుబాటులో లేరు. దీంతో ఈ విషయాన్ని కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఒకవైపు అమరావతి రాజధాని తరలింపు ప్రక్రియను ప్రభుత్వం వేగం చేస్తుంటే, అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న గల్లా జయదేవ్ ఎక్కడకు వెళ్లారన్నదే ప్రశ్న.అయితే దీనికి కారణం ప్రభుత్వం నుంచి వేధింపులు వస్తాయన్న భయంతోనేనని చెబుతున్నారు. గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజ్ సంస్థ భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. దాదాపు 253 ఎకరాలను వెనక్కు తీసుకుంది. అయితే దీనిపై గల్లా కుటుంబం హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకుంది. కానీ భవిష‌్యత్తులోనూ తమకు సమస్యలు ప్రభుత్వం నుంచి ఎదురవుతాయని భావించే గల్లా జయదేవ్ ప్రస్తుతానికి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద గల్లా జయదేవ్ కీలక సమయంలో పార్టీకి హ్యాండ్ ఇచ్చారన్నది స్పష్టంగా తెలుస్తోంది.

Related Posts