YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసే పనిలో కమలం

ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసే పనిలో కమలం

న్యూఢిల్లీ, ఆగస్టు 25, 
భారతీయ జనతా పార్టీ ఇదివరకటి పార్టీ కాదు. మడి కట్టుకుని కూర్చోలేదు. సిద్ధాంతాలు తొక్కా తోలు అన్నది ఇప్పటి బీజేపీకి అసలు తెలీదు. వాజపేయి, అద్వానీ నాయకత్వం వహించిన రోజుల్లో బీజేపీ వేరు. ఇప్పటి బీజేపీ వేరు. ప్రతి అంశమూ దూర దృష్టి, దురాలోచనతో చేసేదే ఇప్పటి నాయకత్వం ప్రాధమిక లక్షణం. సాధారణంగా బీజేపీ ఎప్పుడూ నాయకత్వాన్నే కోరుకుంటుంది. భాగస్వామి అయ్యేందుకు అంగీకరించదు.తనకు ఏమాత్రం పట్టు లేని ప్రాంతాల్లోనే పొత్తులకు బీజేపీ పాకులాడుతుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా వంటి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడక్కడ పొత్తులు కుదుర్చుకుంటుంది. ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికల అనంతర పొత్తులకే బీజేపీ ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంది. మహారాష్ట్రలో తన పార్టనర్ శివసేనతో రెండేళ్ల ముఖ్యమంత్రి పదవికి రాజీపడితే ఇప్పుడు అధికారంలో ఉండేది. అయితే బీహార్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా జేడీయూ నేత నితీష్ కుమార్ ను ప్రకటించడం నిజంగా ఒకరకంగా ప్రత్యేకతగా చెప్పుకోవాలి.ప్రత్యేకత కన్నా వ్యూహాత్మకమేనని చెప్పాలి. జేడీయూ అధినేత నితీష్ కుమార్ చివరి ఎన్నికలనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన 70 వ వడిలో పడ్డారు. ఇంతకు మించి ఆయన రాజకీయాలు చేయలేరు. నితీష్ కుమార్ తదనంతరం జేడీయూ మనుగడ కష్టసాధ్యమే. నితీష్ రాజకీయాల నుంచి విరమించుకున్న వెంటనే జేడీయూ చాపచుట్టేసినట్లే. దానిని బీజేపీలో కలుపుకోవచ్చు. ఆ తర్వాతైనా బీహార్ లో బీజేపీ ముఖ్యమంత్రి అయ్చే ఛాన్స్ ఉంది. అందుకే దూర దృష్టితోనే అమిత్ షా నితీష్ కుమార్ పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుగానే ప్రకటించారు.ఇక మరోవైపు ప్రతిపక్ష పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసే ఛాన్స్ ఈ ఎన్నిక ద్వారా బీజేపీకి దక్కుతుంది. బీహార్ లో జేడీయూ కంటే బలమైన పార్టీ రాష్ట్రీయ జనతా దళ్. లాలూ జైలుకు వెళ్లడంతో ఆ పార్టీ నాయకత్వ లేమితో అల్లాడుతుంది. ఆఫ్టర్ లాలూ ఆ పార్టీ మనుగడ కూడా ఉండదు. ఇప్పటికే కుటుంబంలో ఆధిపత్య పోరు సాగుతోంది. ఇప్పటికే ఆర్జేడీ అధికారంలో లేక చాలారోజులవుతుంది. నితీష్ కుమార్ తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఎంతకాలమో అధికారంలో లేదు. అధికారంలో లేక పోవడంతో పార్టీ నేతలు అనేక మంది జేడీయూ వైపు చూస్తున్నారు. ఇలా ఆర్జేడీని బీహార్ లో పూర్తిగా నిర్వీర్యం చేస్తే తర్వాత ముఖ్యమంత్రి పీఠం పై కన్నేయవచ్చన్నది బీజేపీ అధినాయకత్వం ఆలోచన.

Related Posts