YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

పరాకాష్టకు చేరుకున్న నిత్యానంద వేషాలు

పరాకాష్టకు చేరుకున్న నిత్యానంద వేషాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 25, 
అత్యాచారం ఆరోపణలున్నాయి. నకిలీ పాస్ పోర్ట్ తో చెక్కేశాడన్న కేసులున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. భూముల స్వాహా కేసులున్నాయి. అలాంటి నిత్యానంద స్వామి సొంత దేశం ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఆ దేశానికి కరెన్సీని కూడా విడుదల చేశాడు. తాజాగా తన దేశంలో సొంతంగా రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించారు. కరెన్సీ నాణేలు కూడా బంగారంతో చేసినవని చెబుతున్నాడు. ఈ స్వామి సొంత దేశం ఏర్పాటు చేసుకున్నా ఏ దేశం పట్టించుకోక పోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.నకిలీ పాస్ పార్ట్ తో అరెస్ట్ చేస్తారన్న భయంతో పారిపోయిన నిత్యానంద స్వామి సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈక్వెడార్ నుంచి చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. దానికి కైలాస అని పేరు పెట్టారు. ఆ దేశంలో ఒక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రధాన మంత్రిని తన భక్తుడినే నియమించారు. మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దేశానికి ప్రత్యేకంగా పాస్ పోర్ట్ ను రూపొందించారు. జెండాను, జాతీయ చిహ్నాన్ని కూడా విడుదల చేశారు.తాజాగా తమ కైలాస దేశానికి కరెన్సీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా రిజర్వ్ బ్యాంకును కైలాసంలో ఏర్పాటు చేస్తున్నట్లు నిత్యానంద స్వామి ప్రకటించారు. రిజర్వ్ బ్యాంకు ప్రారంభించే వీడియోను కూడా విడుదల చేశారు. వినాయక చవితి నుంచే రిజర్వ్ బ్యాంకు లావాదేవీలు ప్రారంభమవుతాయని ప్రకటించారు. కరెన్సీ కూడా అదే రోజు నుంచి చలామణిలోకి వస్తుందని తెలిపారు. కరెన్సీకి సంబంధించి పలు దేశాలకు చెందిన బ్యాంకులతో కూడా చట్టబద్ధంగా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడిచారు.అయితే ఈ పిచ్చోడి చర్యలు పరాకాష్టకు చేరుకున్నాయని చెబుతున్నారు. గత ఏడాది నుంచి నిత్యానంద స్వామి పరారీలో ఉన్నట్లు భారత్ లో రికార్డులున్నాయి. మరి భారత్ నిత్యానంద అరెస్ట్ కు ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. హిందుత్వ దేశంగా ప్రకటించుకున్న నిత్యానందను మోదీ ప్రభుత్వం అరెస్ట్ చేసి దేశానికి తీసుకువస్తుందా? లేదా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. దేశం విడిచి పారిపోయి ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకోవడమేంటన్న ప్రశ్నలు వినపడుతున్నాయి. మొత్తం మీద నిత్యానంద స్వామి పిచ్చి పరాకాష్టకు చేరుకుంది.

Related Posts