YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అసద్ ట్వీట్స్ పై దుమారం

అసద్ ట్వీట్స్ పై దుమారం

హైద్రాబాద్, ఆగస్టు 25, 
కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లోని ముస్లిం నేతలు ఎంత కాలం పార్టీ నాయకత్వానికి బానిసగా ఉంటారో తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోని ముస్లిం నేతలంతా తమ సమయాన్ని వృథా చేస్తున్నారని ఆయన విమర్శించారు. గులాంనబీ ఆజాద్ తమను బీజేపీ టీం అంటూ పిలిచేవారని.. ఇప్పుడు సాక్షాత్తూ రాహుల్ గాంధే ఆయనను బీజేపీతో కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించి అనుమానిస్తున్నారని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముస్లిం నేతలు ఈ అవమానాలన్నీ భరించాలా అనేది ఇప్పటికైనా ఆలోచించుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ సూచించారు.‘గులాంనబీ ఆజాద్ నాపై ఎలాంటి ఆరోపణలు చేశారో.. ఇప్పుడు వాటినే ఆయన ఎదుర్కొంటున్నారు. 45 ఏళ్ల గులాంగిరీకి ఫలితమా ఇది? ఆ (గాంధీ కుటుంబం) నాయకత్వాన్ని ప్రశ్నిస్తే.. ఎవరిపై అయినా బీ-టీమ్ (బీజేపీ) ముద్ర వేస్తారని మరోసారి రుజువైంది. ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్న ముస్లిం నేతలు ఇకనైనా ఆలోచించుకోవాలి’ అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కాంగ్రెస్ సీడబ్ల్యూసీ మీటింగ్ వాడీవేడీగా కొనసాగింది. కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ సీనియర్ నేతలు లేఖ రాయడం పట్ల రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లేఖ రాసిన నేతలంతా బీజేపీతో కుమ్మక్కయ్యారా అని రాహుల్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.రాహుల్ గాంధీ వ్యాఖ్యలను గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్ తొలుత ఖండించారు. ట్వీట్లు కూడా చేశారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగునా అని ప్రశ్నించారు. తాము బీజేపీకి అనుకూలంగా ఇన్నేళ్లలో ఏనాడూ మాట్లాడలేదని చెప్పారు.

Related Posts