శ్రీకాకుళం ఆగస్టు 25,
మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ పోలీసు కామాంధుడి ఆగడాలు బయటపడ్డాయి. అక్రమ మద్యం అమ్ముతోందని ఓ కిరాణా షాపు మహిళ యజమానిని పొందూరు ఎస్ఐ రామకృష్ణ అదుపులోకి తీసుకొన్నాడు. ఈ క్రమంలో ఇంటికి వచ్చి లైంగిక వాంఛ తీర్చితే ఆ కేసు నుంచి తప్పిస్తానని, లేదంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసి జైలుకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలితో ఎస్ఐ చేసిన ఫోన్ సంభాషణలు బయటపడటంతో ఆ కీచక ఎస్ఐ గుట్టురట్టైంది.శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం రాపాక జంక్షన్ వద్ద బొడ్డేపల్లి మీనాక్షి అనే మహిళ కిరాణా దుకాణం నడుపోతున్నారు. అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందటంతో పొందూరు ఎస్ఐ ఆమె దుకాణంపై దాడి చేశారు.దీంతో మీనాక్షి దుకాణంలో 11 మద్య సీసాలు దొరికాయి. మద్య సీసాలతో పాటు ఆమెను కూడా పోలీసులు స్టేషన్కు తరలించి ఒక రోజంతా స్టేషన్లో కూర్చోబెట్టారు.ఓ శుభకార్యం కోసం కొనుగోలు చేసిన సీసాలను పట్టుకొని కేసు పెట్టవద్దని వేడుకున్నారు.అయితే ఎస్ ఐ వక్రబుద్దితో ఆమేను లైగింకగా వేదింపులు చేశాడు.దీంతో ఆ అధికారి వ్యవహాయం బట్టబయలు కావడంతో శ్రీకాకుళం జిల్లా పొందూరు ఎస్ఐ కొల్లి రామకృష్ణను సస్పెండ్ చేసినట్టు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ తెలిపారు. ఓ కేసులో మహిళా పట్ల ఫోన్లో అనుచితంగా వ్యహరించినట్లు వచ్చిన ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించారు.ఎస్ఐ కొల్లి రామకృష్ణ పై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్టు ప్రకటించారు.