YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పాదయాత్రకు రెడీ అవుతున్న చినబాబు!

పాదయాత్రకు రెడీ అవుతున్న చినబాబు!

అమరావతి ఆగష్టు 25 
తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర రాజకీయాలకు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. వైఎస్ తో మొదలైన ఈ పాదయాత్ర.. తర్వాతి కాలంలో చంద్రబాబు.. జగన్మోహన్ రెడ్డిలు చేపట్టారు. అధికారాన్ని సొంతం చేసుకోవాలంటే పాదయాత్ర పక్కాగా సాగాల్సిందేనన్న మాట వినిపిస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్లే.. ఈ యాత్రను నమ్ముకున్న ముగ్గురు ముఖ్యమంత్రులు కావటం తెలిసిందే. వ్యక్తిత్వంపై ఒక అంచనాతో పాటు.. ప్రజల మనసుల్ని దోచుకోవటానికి పాదయాత్రకు మించిన ఫార్ములా మరొకి ఉండదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్లే.. తీవ్ర ప్రతికూలత.. సవాళ్లను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీలో ఉత్తేజం నింపేందుకు పాదయాత్రను చేపడుతున్నట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.పైకి చెబుతున్న దానికి.. లోపల జరుగుతున్న ప్లానింగ్ కు పొంతన లేదంటున్నారు. టీడీపీ అధినేతగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు వయసు మీద పడుతున్న పరిస్థితి. నిజానికి ఈ సమయానికి బాబు వారసుడిగా లోకేశ్ ఎదిగి ఉండి ఉంటే.. అసలీ సమస్యలు ఎదురయ్యేవి కావు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకోవటం తెలిసిందే.మ్మెల్సీగా ఎంపిక చేసిన చంద్రబాబు లోకేశ్ ను.. మంత్రిని చేసే వరకు నిద్ర పోలేదు. ఇది కాస్త డ్యామేజ్ చేస్తే.. మైకు పట్టుకున్నంతనే నోటికి వచ్చినట్లుగా మాట్లాడటంతో పాటు.. ఆయన నోటి నుంచి కొన్ని వ్యాఖ్యలు లోకేశ్ మీద ఎలాంటి ఇమేజ్ అయితే రాకూడదో.. అలాంటి ఇమేజే సొంతమైంది. ఇప్పుడు ఆ ముద్రల్ని తొలగించుకోవటంతో పాటు.. తనకంటూ సరికొత్త ఇమేజ్ నుసొంతం చేసుకోవటమే చినబాబు లక్ష్యమైంది. ఇందులో భాగంగా పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై కసరత్తు మొదలైనట్లు చెబుతున్నారు.పాదయాత్రకు సిద్ధం కావటం కోసమే.. లాక్ డౌన్ వేళ పెద్ద ఎత్తున బరువు తగ్గటానికి కారణమిదేనన్న మాట వినిపిస్తోంది. పాదయాత్రకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే.. ఎప్పటి నుంచి అన్న విషయం మీద మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాకుంటే..పాదయాత్ర ద్వారా లోకేశ్ మూడు అంశాల మీద ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తనను తాను మాస్ లీడర్ గా మార్చుకోవటంతో పాటు.. ప్రజాదరణ పెంచుకోవాలన్నది ప్రాధమిక లక్ష్యంగా చెబుతున్నారు.పక్ష నేతగా ఉన్న వేళలో.. జగన్ పాదయాత్ర చేసే సమయంలో 3648 కిలోమీటర్ల దూరాన్ని 155 నియోజకవర్గాల్లో చేపట్టారు. ఇదో రికార్డుగా నిలిచిపోయింది. తన పాదయాత్ర ద్వారా  జగన్ పాదయాత్ర రికార్డును బ్రేక్ చేయటమే కాదు.. నాలుగువేల కిలోమీటర్లు నడవటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర ముగిసే నాటికి లోకేశ్ ను మాస్ హీరోగా మార్చటమే పాదయాత్ర అసలుసిసలు ఉద్దేశంగా చెబుతున్నారు. చెల్లాచెదురైన పార్టీకి కొత్త జవసత్వాలు నింపటం కూడా ఒక టార్గెట్ గా చేసుకున్నట్లు తెలుస్తోంది. తెర వెనుక భారీగా సాగుతున్న కసరత్తుకు సంబంధించిన వివరాలు కొంత బయటకు వచ్చినా.. అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయాల్సి ఉంటుంది.

Related Posts