విశాఖపట్నం ఆగష్టు 25
రాష్ట్ర ప్రజలు ఒకవైపు కరోనాతో అల్లాడిపోతుంటే మరోవైపు సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. మలేరియా,డెంగ్యూ, టైఫాయిడ్ విపరీతంగా గ్రామాల్లో వ్యాప్తి చెందాయని, గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుందని చెప్పారు. ప్రతి ఇంట్లో వ్యాధి సోకి ఒకరిద్దరికి వ్యాధులు సోకుతుంటే ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. గ్రామాల్లో వైద్యం అందిచాల్సిన ఏఎన్ఎమ్ లు, ఆశా కార్యకర్తలు, హెల్త్ వర్కర్లు అసలు గ్రామాల్లోకి వెళ్లడం లేదని జిల్లా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే ఇంకా చాలామంది చనిపోయే ప్రమాదం ప్రమాదం ఉందని,రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, హెల్త్ మినిస్టర్ గాని, గిరిజన శాఖ మంత్రి మంత్రి దీని గురించి పట్టించుకోక పోవడం చాలా బాధాకరమన్నారు.