YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలి

రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలి

నెల్లూరు ఆగష్టు 25  
నెల్లూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి .వెంకట కృష్ణయ్య  ఆదేశాల మేరకు కు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎం.  శ్రీనివాస్ నాయక్  ఆధ్వర్యంలో లో స్టేట్ లీగల్ సర్వీస్ అధారిటీ అమరావతి వారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా ప్రజలను ఉద్దేశించి తెలియజేయునది ఏమనగా  ,చట్టం తెలియక పోవడం క్షమార్హం కాదు, అందువలన నవంబర్ 26 ను భారత రాజ్యాంగ  దినోత్సవంగా జరుపుకుంటున్నాము, అని మరియు ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అధారిటీ అమరావతి వారి ఆదేశాల మేరకు రాజ్యాంగం గురించి ప్రజలకు, పిల్లలకు, మహిళలకు అవగాహన కలిగించే  క్రమంలో, భాగంగా భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి రాజ్యాంగ పరమైన హక్కులు మరియు బాధ్యతలు కల్పించిందని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్14,32 భారతీయ పౌరులందరికీ ప్రాథమిక హక్కులను కల్పించిందని. మరియు ఆర్టికల్51(ఏ) లోని పార్ట్4ఏ ప్రతి పౌరుడు అనుసరించాల్సిన, ప్రాథమిక విధులను అందిస్తుంది. భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవడం మరియు భారత రాజ్యాంగంలో ఉదహరించిన ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధుల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం ప్రతి భారతీయ పౌరుని యొక్క కర్తవ్యం, అందువల్ల నెల్లూరు జిల్లా ప్రజలు అందరూ భారత రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులను పొందుతూ బాధ్యతలను నిర్వర్తిస్తూ మెరుగైన  జీవితం పొందాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వెంకట కృష్ణయ్య ఆకాంక్షించారు.

Related Posts