ఎమ్మిగనూరు ఆగష్టు 25
పట్టణ నడిబొడ్దున ఉన్న కూరగాయల మార్కెట్ కు ఆనుకొని ఉన్న మున్సిపల్ అద్దె దుకాణం (షాప్ నెం:27) స్లాబ్ సోమవారం కూలింది.మెన్ టైలర్స్ & మెటీరియల్స్ పురాతనమైన కట్టడం కావడంతో స్లాబ్ కూలింది. దీంతో దుకాణంలోని సామగ్రి అంత మట్టిలో కలిసిపోయింది. విషయం తెలుసుకున్న కార్మిక సంఘాలు దుకాణం దగ్గరకు చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.వివారాలలోకి వెళితే పట్టణానికి చెందిన ఈరన్న గత 20సంవత్సరాలుగా మెన్ టైలర్స్ & మెటీరియల్స్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక పై భాగంలోని సీలింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయానికి దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. టైలరింగ్ కు సాంబంధించిన మెటీరియల్ తదితర సామగ్రి దెబ్బతిన్నటు బాధితుడు తెలిపారు. సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూలిపోయిన దుకాణాన్ని మున్సిపల్ అధికారులు పరిశీలించారు.