YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అన్ లాక్ 4.0 కు కండిషన్స్ అప్లై

అన్ లాక్ 4.0 కు కండిషన్స్ అప్లై

న్యూఢిల్లీ, ఆగస్టు 25 
కరోనా వైరస్ కట్టడి కోసం మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించగా.. మెల్లగా ఆంక్షలను సడలిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి అన్‌లాక్ 4 ప్రారంభం కానుంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 3 మిలియన్లు దాటగా.. కోవిడ్ కారణంగా 58 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కానీ రికవరీ రేటు ఎక్కువగా ఉంది. దీంతో ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించడం కోసం.. మరిన్ని ఆంక్షలను సడలించే దిశగా కేంద్రం అడుగులేస్తోంది.మార్చి 22న మెట్రో రైళ్లు మూతపడగా.. సెప్టెంబర్ 1 నుంచి ఈ సేవలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం మార్గదర్శకాలను ఈ నెలాఖరులో జారీ చేసే అవకాశం ఉంది. కాకపోతే ప్రయాణికులు టికెన్లు కొనుగోలు చేసి టోకెన్లు ఉపయోగించడానికి కేంద్రం అనుమతి ఇవ్వకపోవచ్చు. మెట్రో కార్డుల ద్వారా మాత్రమే ప్రయాణించే వెసులుబాటు కల్పించే ఛాన్స్ ఉంది.మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా మూతపడిన బార్లలోనూ మద్యం అమ్మకాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం బార్లలో మద్యం కొనుగోలుకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు.స్కూళ్లు, కాలేజీలు తెరుచుకునే అవకాశాలు కన్పించడం లేదు. కానీ ఐఐటీలు, ఐఐఎంలు లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను తెరిచే యోచనలో ప్రభుత్వం ఉంది. సినిమా హాళ్లు, ఆడిటోరియంలు కూడా మరో నెల రోజులపాటు మూత పడే అవకాశం ఉంది. ఒక వేళ సినిమా హాళ్లను తెరిచినా.. ఫిజికల్ డిస్టెన్సింగ్ నిబంధనలు పాటిస్తూ.. 25-30 శాతం కెపాసిటీతో నడపడం ఆర్థికంగా భారంగా కానుంది.రాజకీయాలు, క్రీడలు, ఎంటర్‌టైన్మెంట్, విద్యా సంబంధ, సాంస్కృతిక, సామాజిక, మత సంబంధ ఫంక్షన్లను, భారీగా జనం హాజరయ్యే వేడుకలపై మరో నెలపాటు నిషేధించే అవకాశం ఉంది.అన్‌లాక్ 4 మార్గదర్శకాల్లో ఏయే కార్యకలాపాలపై నిషేధం విధిస్తారనే విషయాన్ని మాత్రమే ప్రస్తావించనున్నారు. మిగతా కార్యకలాపాలన్నీ యధాతథంగా కొనసాగనున్నాయి. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నారు

Related Posts