YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆ కోవిడ్ ఆస్పత్రులపై సీఎం జగన్ సీరియస్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

ఆ కోవిడ్ ఆస్పత్రులపై సీఎం జగన్ సీరియస్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

విజయవాడ, ఆగస్టు 25 
కరోనా వైరస్ వైద్యానికి సంబంధించి అధిక ఫీజులు వసూలు చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఫీజు వసూలు కోవిడ్‌ ఆస్పత్రుల నిర్వహణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్ ‘స్పందన’ కార్యక్రమంపై మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దాని కంటే కోవిడ్‌ రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కరోనా బాధితుల పట్ల వైద్యులు మానవత్వం చూపించాలని సీఎం జగన్ హితవు పలికారు. కోవిడ్ బాధితుడికి అర్ధ గంటలోపు బెడ్ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. 104, 14410 కాల్‌ సెంటర్లకు వచ్చే ఫోన్ కాల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వరదలు, సహాయక చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. గోదావరి, కృష్ణా నదుల్లో వరదలు తగ్గుముఖం పడుతున్నాయని, సెప్టెంబర్ 7 లోపు పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే గోదావరి వరద ముంపు బాధితులకు రూ. 2 వేలు అదనపు పరిహారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.దీంతో పాటు రెగ్యులర్‌గా ఇచ్చే రేషన్‌కు అదనంగా 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పామాయిల్‌, కేజీ ఉల్లి, కేజీ బంగాళదుంపలు, 2 లీటర్ల కిరోసిన్‌ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. సెప్టెంబర్ 7వ తేదీ లోగా నిత్యావసరాలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. వరద ప్రాంతాల్లో రోగాలు రాకుండా మందులు అందుబాటులో ఉంచుకోవాలని.. వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మండల స్థాయిలో నిత్యావసరాలను పూర్తిస్థాయిలో నిల్వ చేసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీటి వసతుల క్లోరినేషన్ కోసం చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

Related Posts