YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

సూక్ష్మ పోషకాలతో అధిక దిగుబడులు : సీఎం చంద్రబాబు

సూక్ష్మ పోషకాలతో అధిక దిగుబడులు : సీఎం చంద్రబాబు

ఒక్కరోజు బంద్ వల్ల రాష్ట్రానికి ఎంత నష్టమో ఆలోచించాలి. మనల్ని మనం శిక్షించుకోరాదు, మనకు అన్యాయం చేసినవారిని శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నాడు నీరు-ప్రగతి,వ్యవసాయంపై    అయన  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల కలెక్టర్లు,  శాఖల అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ భూగర్భ జలమట్టం 21 మీటర్ల నుంచి 15 మీటర్లకు పెరిగిందన్నారు. ఈ ఏడాది జూన్ నుంచే రైతులకు సాగునీటిని అందించాలని అయన  అధికారులకు సూచించారు. సకాలంలోసేద్యం పనులు పూర్తి చేసి, రెయిన్ గన్లు ముందస్తుగా సిద్ధం చేసుకోవాలన్నారు. ఖరీఫ్ సేద్యం ప్రణాళికలు పటిష్టంగా అమలు చేసి విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. సూక్ష్మ పోషకాలు రైతులకు ఉచితంగా అందజేయాలని, పోషకాహార లోపమనేది రాష్ట్రంలో ఉత్పన్నం కారాదన్నారు. సూక్ష్మ పోషకాల వినియోగం వల్ల వివిధ పంటల దిగుబడులు పెరిగాయన్నారు. అంతర్జాతీయంగా మేలైన పద్దతులు అధ్యయనం చేయాలన్నారు. అధికారులు నెలవారీ ప్రగతిని విశ్లేషించాలని, లక్ష్యాలను చేరుకోవాలన్నారు. వినూత్న ప్రణాళికలు రూపొందించి సమర్థంగా అమలు చేయాలన్నారు. 

చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న బంద్ పై కుడా స్పందించారు.  మన నిరసనలు కూడా రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండాలని అన్నారు. అందుకే అరగంట సేపు నిరసనలో పాల్గొనండి, అధికంగా మరో గంటసేపు పనిచేయండని కోరాననని అన్నారు. ఒక రోజు బంద్తో ఆర్టీసీకి రూ.12కోట్ల నష్టం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బస్సులు లేక దాదాపు 65 లక్షల మంది ప్రయాణీకులు ఇబ్బందిపడ్డారని తెలిపారు. అలాగే దుకాణాల మూత పడటం వల్ల ఎందరో ఉపాధి కోల్పోయారని సీఎం అన్నారు.

Related Posts