YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కమలానికి ఓటేస్తున్న వైసీపీ ఎంపీలు

కమలానికి ఓటేస్తున్న వైసీపీ ఎంపీలు

ఏలూరు, ఆగస్టు 26, 
వైసీపీకేం అధికారంలో ఉంది. కేంద్రంలో బీజేపీ కూడా సానుకూలంగా ఉంది. ఏ పదవిలో ఉన్నా వారి పంట పండినట్లే. ఇది కదా బయట నుంచి చూసేవారి అంచనా. కానీ వైసీపీ లోపల సీన్ మాత్రం అంత కూల్ గా ఏమీ లేదట. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య డిష్యూం, డిష్యూం అన్నంతగా సమరం సాగుతోంది. అధికారాల కోసం కొట్లాట బాగానే జరుగుతోంది. అదే విధంగా ప్రోటోకాల్ మీద కూడా కుస్తీ పడుతున్నారు. వైసీపీలో ఎంపీలు ఒక విధంగా విలువ లేదని బాధ పడుతున్నారుట. అది జగన్ దృష్టికి వెళ్ళిందో లేదో కానీ తాము వైసీపీ ఎంపీలుగా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయమి మదన పడుతున్నారుట. వైసీపీకి చెందిన ఒక ఎంపీ వినాయకచవితి సందర్భంగా సోషల్ మీడియాలో పెట్టిన ఒక శుభాకాంక్షల పోస్టింగ్ ఆ పార్టీలో ఎంపీల మండిపాటు ఏంటో చెప్పిందని అంటున్నారు. సదరు ఎంపీ గారు చవితి కి తన క్యాడర్ కి గ్రీటింగ్ చెబుతూ పెట్టిన పోస్ట్ లో వైఎస్సార్ బొమ్మ కానీ, జగన్ బొమ్మ కానీ ఎక్కడా కనిపించకపోవడం విశేషం. దీని మీద కొంతమంది కార్యకర్తలు నిల‌దీస్తే సదరు ఎంపీ పీఏ నుంచివచ్చిన సమాధానం ఆటంబాంబులా ఉందిట. పార్టీలో మమ్మల్ని పట్టించుకోని వారి గురించి మేమెందుకు పట్టించు కోవాలన్నది సదరు ఎంపీ పీఎ గారి ఘాటైన సమాధానం. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఎంపీలను సొంత పార్టీ ఎమ్మెల్యేలే చులకన చేసి చూస్తున్నారని సదరు ఎంపీ వాపోయారని టాక్. తమకు నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం జరిగినా పిలుపులు ఉండవు, అంతా ఎమ్మెల్యేల ఇష్టమే. సంక్షేమ పధకాల విషయంలో కనీసం సంప్రదించరు. ఏ అభివృధ్ధి కార్యక్రమం జరిగినా కూడా మేము కనిపించం, ఇంతలా అవమానం చేస్తున్నపుడు వైసీపీ మా పార్టీ అని ఎందుకు చెప్పుకోవాలి అన్నది ఆ ఎంపీ గారి ఆవేదనట.ఇక ఆ ఎంపీ గారు మరో విషయం కూడా చెప్పారుట. తమకు ఉన్న చోట కంటే ఢిల్లీలోనే ఎక్కువ గౌరవం దక్కుతోందని ఆయన అంటున్నారుట. బీజేపీ ఏలుబడిలో తమకు బాగా చూసుకుంటున్నారంటూ ఆయన నోరు జారేశారు. దాంతో ఇక్కడే వస్తోంది అసలైన చిక్కు. ఇప్పటికే బీజేపీ ఉచ్చులో పడిన రఘురామరాజు వైసీపీని జగన్ని ఒక లెక్కన చెడుగుడు ఆడుకుంటున్నారు. మరి సదరు ఎంపీగారు ఇదే రకమైన అభిప్రాయంతో ఉంటే ఎంతమంది రెబెల్స్ వైసీపీ నుంచి తయారవుతారో తెలియడంలేదని పార్టీలో చర్చ సాగుతోంది. ఎంపీలు ఇలా మధనపడడానికి వారి విషయంలో హై కమాండ్ కూడా పట్టనట్లుగా ఉండడం కూడా మరో కారణం అంటున్నారు.

Related Posts