ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మహాత్మా జ్యోతిబా పూలే, అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మహాత్మా జ్యోతిబా పూలే, బీఆర్ అంబేడ్కర్ జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ మన భాష, మన దేశాన్ని , జన్మ భూమి ని ఎన్నటికీ మరవద్దు. ఏప్రిల్ నెల మహనీయులు జన్మించిన నెల గా ఉంది. 170 సంవత్సరాల క్రితమే అసమానతలను గుర్తించారని అన్నారు. ఎక్కడ చదువు ఉండదో అక్కడే అసమానతలు ఉంటాయని జ్యతి పూలే చాటి చెప్పారు. రాజ్యాంగం నిర్మాత అంబేడ్కర్ ను అన్ని వర్గాల వారు గురువుగా గుర్తిస్తారు. కానీ, మహాత్మ జ్యోతి పూలే నే అంబేద్కర్ గురువుగా స్వీకరించారని అన్నారు. బలహీన వర్గాలు, అనగారిన వర్గాలు అన్న పదాన్నే మర్చిపోయి పోరాడాలి. గంజి తాగిన దళిత బడ్డ తెలంగాణ లో ఎవరెస్టు ఎక్కి సత్తా చాటిందన అయన అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసుదనా చారి మాట్లాడుతూ జీవితాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగితే అంబేద్కర్, పూలేలు గా ఎదగవచ్చని అన్నారు. అప్పటి సమాజం తో పోలిస్తే ఇప్పటి సమాజం కొంత మెరుగుపడింది. అంబేద్కర్, పూలే లు ప్రతికూల పరిస్థితులను ఒడిసిపట్టుకొని దేశానికి దశా, దిశను చూపారు
మహాత్మలను స్మరించడం కాదు, వారి అడుగు జాడలలో నడిచి విజయాలను అందుకొవాలని అన్నారు. అంబేద్కర్, పూలే లు ఎలాంటి సదుపాయాలను వాడుకోకుండా ప్రతికూల పరిస్థితుల్లో పోరాడి ఆదర్శంగా నిలిచారని అన్నారు.