YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సిక్కోలులో కోలుకొనేదెప్పుడు

సిక్కోలులో కోలుకొనేదెప్పుడు

శ్రీకాకుళం, ఆగస్టు 26, 
అవును! ఇప్పుడు ఎవ‌రిని క‌దిలించినా.. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే అంటున్నారు. గ‌త ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ హ‌వా కొన‌సాగినా.. ఈ జిల్లాలో ఎంపీ స్థానం టీడీపీ కైవ‌సం చేసుకుంది. టెక్కలి నుంచి కింజ‌రాపు అచ్చెన్నాయుడు విజ‌యం సాధించారు. రాష్ట్ర టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్న క‌ళా వెంక‌ట్రావు.. ఈ జిల్లాకు చెందిన నాయ‌కుడే. అయితే, ఇదే జిల్లాలోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్తితి దారుణంగా ఉన్నప్పటికీ.. ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌నే వాద‌న ఉంది. పైగా గ్రూపు రాజ‌కీయాల‌తో మ‌రింత‌గా పార్టీ ప‌రిస్థితిని దిగ‌జార్చుతున్నార‌నే విమ‌ర్శలు కూడా వినిపిస్తున్నాయి.రాజాం నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే.. గ‌తంలో ఇక్కడ కావ‌లి ప్రతిభాభార‌తి ప్రాతినిధ్యం వ‌హించారు. స్పీక‌ర్‌గా కూడా వ్యవ‌హ‌రించారు.2009, 2014 ఎన్నిక‌ల్లో ఆమె పోటీ చేసినా ఆమె ఓడిపోయారు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌లకు ముందు తీవ్ర అనారోగ్యం పాల‌వ‌డంతో.. త‌న అనంత‌రం ఈ నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌ల‌ను త‌న కుమార్తె గ్రీష్మకు ఇవ్వాల‌ని ఆమె కోరారు. అయితే, ఇంతలోనే కాంగ్రెస్ నుంచి దూరంగా త‌ట‌స్థంగా ఉన్న మాజీ మంత్రి కోండ్రు ముర‌ళి.. టీడీపీలోకి వ‌చ్చారు. వాస్తవానికి ఆయ‌న వైసీపీలోకి రావాల‌ని పిలుపు వ‌చ్చినా వెళ్లకుండా చంద్రబాబు వైపు మొగ్గారు. దీంతో గ‌త ఏడాది అనూహ్యంగా ఇక్కడ టికెట్ సంపాయించుకున్నారు.కానీ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన పునాది వేసుకున్న వైసీపీ నాయ‌కుడు.. కంభాల జోగులు ముందు నిల‌వ‌లేదు. కోండ్రు ఓట‌మి పాల‌య్యారు. దీంతో ఆయ‌న పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్పటి నుంచి ముర‌ళీ నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముర‌ళీని త‌న పాత ప‌రిచ‌యాల‌తో ( వీరిద్దరు ఒకే మంత్రివ‌ర్గంలో ఉన్నారు). బీజేపీలోకి తీసుకు వెళ్లేందుకు విశ్వప్రయ‌త్నాలు చేశారు. ఇక ఇప్పుడు వైసీపీ నుంచి స‌రైన ఆఫ‌ర్ లేద‌నే కాని లేక‌పోతే ఇప్పటికే ముర‌ళీ కండువా మార్చేవార‌ని టాక్‌..? ముఖ్యంగా తాను పార్టీ అభివృద్ధి కోసం ఎంతైనా క‌ష్టప‌డ‌తాన‌ని.. అయితే నియోక‌వ‌ర్గంలో ఓ వ‌ర్గం త‌న‌కు స‌హ‌క‌రించ‌క‌పోగా.. త‌న‌ను అణ‌గ‌దొక్కేందుకు ప్రయ‌త్నాలు చేస్తోంద‌ని ఆయన స‌న్నిహితుల వ‌ద్ద ప‌రోక్షంగా క‌ళా వెంక‌ట్రావుపై విమ‌ర్శలు గుప్పిస్తున్నార‌ట‌.మ‌రోప‌క్క, ప్రతిభా భార‌తి కుమార్తె గ్రీష్మకు ఇక్కడి బాధ్యత‌లు అప్పగించే విష‌యంలో సాక్షాత్తూ క‌ళా వెంక‌ట్రావే అడ్డుపుల్లలు వేస్తున్నార‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో అటు కోండ్రు ప‌ట్టించుకోక‌.. ఇటు భార‌తి కూడా పార్టీ ప‌గ్గాలు ఇవ్వలేదు కాబ‌ట్టి మాకెందుక‌ని అనుకోవ‌డంతో .. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జోగులు దూకుడు ఓ రేంజ్‌లో సాగుతుండ‌గా .. రాజాంలో టీడీపీ జెండా మోసే వ్యక్తి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీకి కేడ‌ర్ ఉన్నప్పటికీ న‌డిపించే నాయ‌కుడు లేక కునారిల్లుతోంది.

Related Posts