YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

సెల్ ఫోన్ లో బంగారం

సెల్ ఫోన్ లో బంగారం

హైద్రాబాద్, ఆగస్టు 26, 
విైదేశాల నుంచి వచ్చేవారు బంగారం తెచ్చుకుంటున్నారు. ఏదో ఒక మార్గంవారు అనుసరిస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో తాజాగా బంగారం పట్టుబడిన తీరే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దుబాయి నుంచి బంగారం తెచ్చుకోవడానికి వారు పాత సెల్ ఫోన్ వాడారు. అది కూడా ఓల్డ్ మోడల్ కావడంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. సెల్ ఫోన్లో బ్యాటరీ తీసేసి ఆ ప్లేస్ లో అదే సైజు బంగారం బిస్కెట్ అమర్చారు. మామూలుగా అయితే ఎవరికీ అనుమానం రాదు.కానీ ఎయిర్ పోర్టుకి వచ్చే ప్రయాణికుల్ని అమూలాగ్రం చెక్ చేసే కస్టమ్స్ అధికారుల దృష్టి ఈసెల్ ఫోన్ పై పడింది. నీకు నాకు నోకియా.. అన్నట్టుగా ఈ ఫోన్ తో తన లైఫ్ మారిపోతుందని భావించిన అక్రమార్కులకు చెక్ పడింది. ఈ ఫోన్లో 505 గ్రాముల బంగారం ఇరికించారు. చివరాఖరికి వారు బుక్కయ్యారు. అక్రమార్కులు రెండాకులు ఎక్కువ చదివితే.. కస్టమ్స్ అధికారులు నాలుగాకులు ఎక్కువే చదువుతున్నారని చెప్పవచ్చు.

Related Posts