YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సెప్టెంబర్‌ 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు

సెప్టెంబర్‌ 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 26, 
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం నిర్ణయించారు. సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్ణయించాలని ప్రభుత్వ భావిస్తోంది. క్యాబినెట్ కమిటీ ఈ మేరకు సిఫారసు చేసింది. దీనికి తుది ఆమోదం లభించాల్సి ఉంది. కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ వర్షాకాల సమావేశాలు నిర్వహించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం లోక్ సభ, రాజ్యసభలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.ఉదయం లోక్‌సభ, మధ్యాహ్నం రాజ్యసభ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా ఇరు సభలలో సభ్యులకు సీట్లను కేటాయిస్తారు. లోక్ సభ సభ్యులకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో, రాజ్యసభ సభ్యులకు లోక్ సభ, రాజ్యసభలో సీట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.రాజ్యాంగ నిబంధనల మేరకు ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్‌ సమావేశం కావాలి. దీంతో కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలోనూ పార్లమెంట్‌ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సభ్యుల కోసం ప్రవేశ ద్వారాల వద్ద, అవసమైన ఇతర ప్రదేశాల్లో స్క్రీనింగ్ నిర్వహణతో పాటు శానిటైజింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఎంపీల వ్యక్తిగత సిబ్బందిని మాత్రం పార్లమెంట్‌లోకి అనుమతించరని తెలుస్తోంది.

Related Posts