YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం

స్కూళ్లకు నో పర్మిషన్

స్కూళ్లకు నో పర్మిషన్

న్యూఢిల్లీ, ఆగస్టు 26, 
కరోనా అన్‌లాక్-3 ముగియనున్న నేపథ్యంలో.. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్-4కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సిద్ధం చేసింది. అన్‌లాక్-4లో మరిన్ని ఆంక్షలను సడలించినప్పటికీ విద్యా సంస్థలను మాత్రం తెరవకూడదని కేంద్రం నిర్ణయించింది.స్కూళ్లు, కాలేజీల పున: ప్రారంభానికి సంబంధించి కేంద్రహోంశాఖ నుంచి ఎలాంటి మార్గదర్శకాలు అందలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలు మూసివేసే ఉంటాయని తెలుస్తోంది. కానీ సెప్టెంబర్ 1 నుంచి మాత్రం స్కూళ్లు, కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.ఇక అన్‌లాక్-4లో మైట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పటికే పలు నగరాల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. మెట్రో సర్వీసులు తెరిచాక ఎలాంటి రూల్స్ పాటించాలో ఈ వారాంతంలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.

Related Posts