YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీ కాంగ్రెస్ లో మెయిల్స్ రచ్చ

టీ కాంగ్రెస్ లో మెయిల్స్  రచ్చ

హైద్రాబాద్, ఆగస్టు 26, 
తెలంగాణ కాంగ్రెస్ కు నాయకత్వ సమస్య ఏర్పడింది. పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అత్యవసరం. వరస ఓటములు ఆ పార్టీని కుంగదీశాయి. ఉన్న నేతలు కూడా అధికార పార్టీలోకి ఇప్పటికే సర్దుకున్నారు. మరోవైపు క్యాడర్ లో కూడా నైరాశ్యం అలుముకుంది. దీంతో ఇటు నేతలను సమన్వయం చేసుకుని వెళ్లగలిగే సమర్థవంతమైన నేత కావాలి. క్యాడర్ కూడా ఇదే కోరుకుంటుంది. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకూ దీనిపై దృష్టి సారించలేదు.తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ ఆ ధైర్యం చేయకుంటే రాష్ట్రం వచ్చేది కాదు. కేసీఆర్ దీక్షలో, తెలంగాణ ఉద్యమం వల్ల వచ్చిందనుకోవడం పొరపాటని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి రెండు ఎన్నికల్లో వరస ఓటములను చవి చూసింది. దీనికి ప్రధాన కారణం నాయకత్వ సమస్య. దీంతో పాటు గ్రూపు విభేదాలు. ఒకరినొకరు ఓడించుకోవడం ఆ పార్టీ అధికారంలో లేకపోవడానికి కారణాలుగా చెప్పాలి.ఇక ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. సిట్టింగ్ సీటును కోల్పోవడం నిజంగా ఆ పార్టీ నాయకత్వ సమర్థతకు నిదర్శనం. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు.ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. కానీ గ్రూపు విభేదాల కారణంగా పీసీసీ అధ్యక్షుడిగా ఎవరినీ ఇప్పటి వరకూ నియమించలేదు. అయితే ఇది కాంగ్రెస్ కు తీరని నష్టం చేకూరుస్తుందంటున్నారు.అయితే కాంగ్రెస్ కు ఇప్పుడు కేసీఆర్ ను ఎదిరించే నేత కావాలి. ప్రజల్లో నమ్మకం కల్గించే లీడర్ కావాలి. కాంగ్రెస్ కు అధికారమిచ్చినా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయించగలగిన నేత అని ప్రజల్లో విశ్వాసం కల్గించాలి. అలాంటి సత్తా ఉన్న వాళ్లకే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని అనేక మంది కోరుతున్నారు. హైకమాండ్ కు మెయిల్స్ ద్వారా తెలుపుతున్నారు. దాదాపు వేల సంఖ్యలో మెయిల్స్ ఇప్పటికే అధిష్టానానికి వెళ్లినట్లు తెలుస్తోంది. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related Posts