త్రినేత్ర గణేశయ ఆలయంలో వినాయకుడు మూడు కన్నులతో భక్తులకు కనువిందు చేస్తాడు.
రాజస్థాన్లోని రణ్ థాంబోర్ కోటలో ఉన్న ఈ ఆలయంలోని వినాయకుడిని ప్రథమ గణేశ' అని కూడా అంటారు. దేశంలో ఇదే మొట్టమొదటి వినాయక ఆలయంగా భావిస్తారు. ఈ ఆలయంలో వెలసిన త్రినేత్ర గణేశ విగ్రహం దాదాపు ఆరున్నర వేల ఏళ్ల కిందటిదని అంచనా. రుక్మిణీ కృష్ణుల వివాహం జరిగినప్పుడు వారు తొలి ఆహ్వాన పత్రికను ఇక్కడి ప్రథమ గణేశునికే పంపారని స్థలపురాణ కథనం. ఇప్పుడు ఈ ఆలయం వెలసిన కోట రణ్ థాంబోర్ జాతీయ పార్కు పరిధిలో ఉంది. ప్రస్తుతం ఉన్న ఆల యాన్ని పదమూడో శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు హమీర్ నిర్మించినట్లు చెబుతారు. హమీర్ వినాయకుడికి పరమభక్తుడు. హమీర్ ఇక్కడ ఆలయం నిర్మించడం వెనుక కూడా ఒక గాథ ప్రచారంలో ఉంది. అప్పట్లో రణ్ థాంబోర్ కోటపై అల్లాఉద్దీన్ ఖల్జీ దాడి చేశాడు. యుద్ధం ఏళ్ల తర బడి కొనసాగింది. యుద్ధానికి సిద్దపడి ముందుగా కోటలోని గోదాముల్లో నిల్వచే సిన తిండి గింజలు, ఇతర నిత్యావసరాలు నిండుకున్నాయి. దిక్కుతో చని స్థితిలో ఉన్న రాజు తనను, తన రాజ్యాన్నీ, ప్రజలనూ కాపాడా లంటూ గణపతిని ప్రార్థించాడు. రాజు హమీర్ కు గణపతి కలలో కనిపించాడు. 'రేపటి నుంచి నీ సమస్యలన్నీ మటుమాయమైపో తాయి' అని పలికాడు. మర్నాటికల్లా ఖిల్జీ సేనలు వెనక్కు మళ్ల డంతో యుద్ధం ముగిసిపోయింది. గోదాముల్లో తిండి గింజలు వచ్చి చేరాయి. కోట గోడ నుంచి త్రినేత్ర గణపతి విగ్రహం ఆశ్చ ర్యకరంగా బయటపడింది. ఈ అద్భుత సంఘటనతో గణప తిపై రాజు హమీర్ భక్తివిశ్వాసాలు రెట్టింపయ్యాయి. గణపతిని వృద్ధి సిద్ది సమేతంగా, గణపతి కొడకులైన శుభ లాభాల విగ్రహాలను, గణపతి వాహనమైన మూషిక విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మిం చాడు. ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో శుభకార్యాలు జరిపేటప్పుడు ఇక్కడి ప్రథమ గణపతికి తొలి ఆహ్వాన పత్రికలు పంపిస్తూ ఉంటారు. ప్రథమ గణపతికి తొలి ఆహ్వానం పంపితే, శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయని నమ్ముతారు.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో