YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మంత్రి అనిల్ ఆగ్రహం

మంత్రి అనిల్ ఆగ్రహం

నెల్లూరు  ఆగస్టు 26, 
నేను ఫోన్‌ చేస్తే తీయవు.. కోవూరు ఎమ్మెల్యే నాలుగు సార్లు చేసినా లిఫ్ట్‌ చేయవు.. ఎవరికి సమాధానం చెప్పాలనుకుంటున్నావ్‌.. నీ కోసం మేము మాటలు పడాలా.. నీకు కరోనా వస్తే ఐసీయూలో చేరవా.. మిగతా వారు మనుషులు కాదా.. ఐసీయూను సరి చేసుకోలేకపోతున్నావు.. నువ్వేం సూపరింటెండెంట్‌వి.. ఆరు నెలల నుంచి చెబుతున్నా.. ఆసుపత్రిలో ఏమి సౌకర్యాలు కావాలన్నా కల్పిస్తామన్నాం.. ఎందుకు స్పందించడం లేదంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సుధాకర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.నెల్లూరులోని నూతన జిల్లా పరిషత్‌ సమావేశమందిరంలో కొవిడ్‌-19 సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రతి రోజు ఎన్ని కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఫలితాలు ఎన్ని రోజుల్లో ఇస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో బెడ్స్‌ లభించడం లేదని క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు, ఆసుపత్రి యాజమాన్యాలు సమన్వయం చేసుకుని సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో మరణాల సంఖ్య పెరుగుతోందని, కట్టడి చేయాలని, పాజిటివ్‌ వ్యక్తులను ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చిన ఏ వ్యక్తికి బెడ్‌ లేదనే సమాధానం రాకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారని, జిల్లాలో ఇది తప్పక అమలు కావాలన్నారు. జీజీహెచ్‌లో ఉన్న ఐసీయూ విభాగంలో సౌకర్యాలను పరిశీలించాలని జేసీని ఆదేశించారు. నారాయణలో అధికంగా ఉన్న వైద్యులను జీజీహెచ్‌లోని ఐసీయూ విభాగంలో సేవలందించేందుకు కేటాయించాలని నారాయణ యాజమాన్య ప్రతినిధులకు సూచించారు. ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలల్లో చదువుతున్న 2, 3 సంవత్సరాల విద్యార్థులను కొవిడ్‌ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
=

Related Posts