YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

సివరేజీ సమస్యల శాశ్వత పరిష్కారం - తీగుల్ల పద్మారావు గౌడ్

సివరేజీ సమస్యల శాశ్వత పరిష్కారం - తీగుల్ల పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, ఆగస్టు 26, 
సికింద్రాబాద్ పరిధిలో సివరేజి సమస్యల శాశ్వత పరిష్కారానికి అన్ని ఏర్పాట్లు జరిపామని, దశాబ్దాల క్రితం అప్పటి అవసరాలు, అప్పటి జనాభాకు అనుగుణంగా చేసిన సివరీజీ వ్యవస్థకు కాలం చెల్లినందున భవిష్యత్తు అవసరాలను కుడా దృష్టిలో ఉంచుకొని సివరేజి వ్యవస్థను అధునీకరిస్తున్నామని ఉప సభాపతి  తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.  బౌద్ధనగర్ డివిజన్ లో అల్లాడి రాజ్ కుమార్ నగర్ లో రూ. 27 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న సివర్ లైన్ ల నిర్మాణం పనులను అయన  బుధవారం ప్రారంభించారు. స్థానిక కార్పోరేటర్ ధనజన బాయి గౌడ్, తెరాస జల మండలి జీ ఎం  రమణా రెడ్డి,డీజీఎం  కృష్ణ, మేనేజర్  కృష్ణ మోహన్, అధికారులు, నేతలు పాల్గొన్నారు. ఉప సభాపతి మాట్లడుతూ  బౌద్ధనగర్ డివిజన్ పరిధిలో కేవలం 5 సంవత్సరాల కాలంలో రూ. 3 కోట్ల ఖర్చుతో జల మండలి ద్వారా సివరేజి వ్యవస్థకు సంబంధించి పనులను చేపట్టాం.  నగరంలో ప్రప్రధమగా కృష్ణా జలాలను  బౌద్ధనగర్ కు మళ్ళించేందుకు ఏర్పాట్లు జరిపాము. ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న దాహార్తిని తీర్చ గలిగాం. బౌద్ధనగర్ డివిజన్ లోని అంబర్ నగర్ ప్రాంతం లో రోజూ నీటి సరఫరాకు ఏర్పాట్లు జరిపాం. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు మేము సిద్దంగా ఉన్నాం.  జలమండలి అధికారులు అందిస్తున్న వన్ టైం సెట్ల్లెమెంట్ పధకాన్ని వినియోగించుకొని బకాయీలు చెల్లింపులో రాయితీని పొందవచ్చని అయన అన్నారు.

Related Posts