YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు మళ్లీ షాక్... 3 రాజధానుల పిటీషన్ కొట్టివేత

జగన్ కు మళ్లీ షాక్... 3 రాజధానుల పిటీషన్ కొట్టివేత

న్యూఢిల్లీ, ఆగస్టు 26
ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణ జరిగింది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమంది.మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణ జరగ్గా.. పిటిషన్‌ను జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ , జస్టిస్‌ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమంది. దీంతో జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది. మూడు రాజధానుల అంశంపై గురువారం హైకోర్టులో విచారణ ఉందని.. తమ వద్దకు రావడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈకేసును హైకోర్టు త్వరగా పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ధర్మాసనం.. ఆ తర్వాత జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌ ధర్మాసనం ముందుకు రాజధాని పిటిషన్ విచారణకు రాగా.. సాంకేతిక కారణాలతో మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. దీంతో బుధవారం జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ ధర్మాసనం ఈ పిటిషన్‌‌పై విచారణ జరిపింది.

Related Posts