YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

కూతురుపై లైంగిక దాడి... బిడ్డకు జన్మ

కూతురుపై లైంగిక దాడి... బిడ్డకు జన్మ

ముంబై, ఆగస్టు 26 
కన్నకూతురిపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న కీచక తండ్రి ఆమెను గర్భవతిని చేశాడు. బాలిక ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి కన్నకూతురిపైనే రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న నీచపు ఘటన ఇది. ఆ కామాంధుడి చేతిలో నరకం చవిచూస్తున్న బాలిక తెలిసీ తెలియని వయసులోనే గర్భం దాల్చి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో వెలుగుచూసింది.నగరంలోని పంత్ నగర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక రాజావాడీ ఆసుపత్రిలో రెండ్రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె మైనరని గుర్తించిన డాక్టర్లు దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని ప్రశ్నించగా షాకింగ్ విషయాలు బయటపెట్టింది. 2018, మార్చి నుంచి కన్నతండ్రే తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదరించాడని తెలిపింది.తాను గర్భం దాల్చినా కూడా విడిచిపెట్టకుండా తండ్రి లైంగిక దాడికి పాల్పడేవాడని బాధితురాలు చెప్పింది. దీంతో ఆ నీచుడిపై ఐపీసీ 376, సెక్షన్ 4,6,8,10,12 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కూతురినే తల్లిని చేసిన ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts