YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పాతబస్తీ ఆలయంలో చోరీ

పాతబస్తీ ఆలయంలో చోరీ

హైద్రాబాద్, ఆగస్టు 26 
తెలంగాణలో దోపిడీ దొంగతనాలు కలకం రేపుతున్నాయి. రాష్ట్రంలో పలు ఆలయాల్ని టార్గెట్ చేసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా రాష్ట్రంలో రెండు చోట్ల ఆలయంలో చోరీలు జరిగాయి. భాగ్యగనరంలోని పాతబస్తీ చెన్నకేశవ ఆలయంలో పాటు, నల్గొండ జిల్లాలోని కనకదుర్గ ఆలయంలో కూడా దొంగతనాలు జరిగాయి. అమ్మవారి నగలు, ఆభరణాల్ని దొంగలు ఎత్తుకెళ్లారు.హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ఆలయంలో దుండగులు ప్రవేశించి దోపిడీ చేశారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వయంభూ లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో దొంగల బీభత్సం సృష్టించారు. గుర్తుతెలియని కొందరు వ్యక్తులు దేవాలయంలో లోకి ప్రవేశించారు. గుడిలో హుండీ తాళాలు పగులగొట్టి నగదును దోచుకెళ్లారు. ఉదయం పూజారులు దేవాలయంలో పూజలు చేసేందుకు గుడి తలుపులు తెరిచారు. దీంతో గుడిలో చోరీ జరిగిన విషయం బయటపడింది. ఆ సమయంలో హుండీ పగులగొట్టిన విషయం పూజారులు గ్రహించారు.వెంటనే దేవాలయ చైర్మన్ నాగరాజుకు సమాచారం అందించారు. అతను వెంటనే చాంద్రాయణగుట్ట పోలీసు లకు ఫిర్యాదు చేశారు. హుండీ లో భక్తులు చెల్లించే డబ్బులు , ఆలయంలో వెండి దొంగలించినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. చాంద్రాయణగుట్ట పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకొని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. గుడి పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజులను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. నిందితులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.మరోరవైపు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కూడా ఈ విధంగానే గుడిలో చోరీ జరిగింది. పట్టణంలోని గాంధీనగర్ కనకదుర్గమ్మ దేవాలయంలో దొంగతనానికి పాల్పడ్డారు. గర్భగుడి తాళం పగలకొట్టి .. అమ్మవారి విగ్రహం పై ఉన్న 12 కిలోల వెండి 2 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గుడి హుండీలో ఉన్న నగదును కూడా దొంగలు వదల్లేదు. పూజారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Related Posts