మచిలీపట్నం ఆగస్టు 26
వైఎస్సార్సీపీ నేత, రవాణా, సమాచార శాఖల మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్ రావు హత్య కేసులో జైలు కెళ్లిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జైలు నుంచి విడుదలయ్యారు. మోకా భాస్కరావు హత్య కేసులో ఏ4గా ఉన్న కొల్లు రవీంద్రకు మంగళవారం సాయంత్రం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో గత 53 రోజులుగా జైల్లోనే ఉన్న కొల్లు రవీంద్ర తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, జూన్ నెలలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కర్ రావు దారుణ హత్యకు గురవడం , ఆపై రాజకీయ కక్షల కారణాలతో భాస్కర్ రావును హత్య చేయించారని వైసీపీ నేతలు ఆరోపించారు. 28 రోజుల పాటూ విజయవాడలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది.. అది కూడా సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని సూచించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా కేసులు ఉన్నాయి.. అందుకే ఆయన్ను విజయవాడలోనే సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని కోర్టు సూచించినట్లు తెలుస్తోంది.