YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనాతో మరణించే జర్నలిస్టులకు రూ. 15 లక్షల ఎక్స్గ్రేషియా పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయం

కరోనాతో మరణించే జర్నలిస్టులకు రూ. 15 లక్షల ఎక్స్గ్రేషియా పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్  సంచలన  నిర్ణయం

పంజాబ్ ఆగష్టు 26 
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ క్లిష్టమైన సమయంలో కూడా తమ  విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టు కుటుంబాల సంక్షేమానికి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్  సంచలన  నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఈ  రూ.10 లక్షల నష్టపరిహారం గుర్తింపు పొందిన (అక్రిడిటేటడ్) జర్నలిస్టులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. కాగా కరోనా బారినపడిన పటియాలాకు చెందిన 28 ఏళ్ల జైదీప్ అనే జర్నలిస్టు ఆదివారం మృతి చెందాడు. దైనిక్ భాస్కర్ దైనిక్ సేవా సవేరా గ్రూపులలో పనిచేసిన జైదీప్ జర్నలిస్టుగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ ముఖ్యమంత్రి  అమరీందర్ జర్నలిస్టు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించాలని నిర్ణయం తీసుకున్నారు.   వైరస్పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో విలేకరుల పాత్ర  కీలకమని ముఖ్యమంత్రి అన్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా  వాళ్లంతా నిబద్ధతతో పని చేస్తున్నారని  కొనియాడారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో జర్నలిస్టులు కరోనా భారిన పడ్డారు. ఇకపొతే రాష్ట్ర వ్యాప్తంగా 44557 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ఇప్పటివరకు 1178 మంది కరోనా వైరస్ బాధితులు ప్రాణాలు విడిచారు. 29145 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14254 యాక్టివ్ కేసులున్నాయి.

Related Posts