YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

మారటోరియంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యాపారం పైనే కాదు...ప్రజల బాధను చూడండి

మారటోరియంపై సుప్రీంకోర్టు ఆగ్రహం      వ్యాపారం పైనే కాదు...ప్రజల బాధను చూడండి

న్యూఢిల్లీ ఆగష్టు 26 
కేంద్రప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోన్ మారటోరియానికి సంబంధించిన ప్రజలను బాధను కూడా దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ ఇచ్చిన వెసులుబాటు లోన్ మారటోరియం కాలానికి వడ్డీని మాఫీ చేయవచ్చా లేదా మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేయవచ్చా అనే అంశంపై కేంద్రం నిర్ణీత సమయంలో సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని వ్యాపార కోణంలో మాత్రమే ఆలోచించవద్దని, ప్రజల బాధను కూడా పట్టించుకోవాలని సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.ఈ సమస్య కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల కలిగిందని పేర్కొన్నది. యూనియన్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనుక ఉన్నట్లుగా కనిపిస్తున్నదని అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. దీనిని వ్యాపార పరంగా మాత్రమే ఆలోచించవద్దని, రిలీఫ్ అవసరమని పేర్కొన్నది. కరోనా-లాక్ డౌన్ నేపథ్యంలో లోన్ మారటోరియాన్ని కేవలం బిజినెస్ కోణంలోనే ఆలోచించడం సరికాదని ప్రజల ఇబ్బందులు పరిగణలోకి తీసుకోవాలన్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్(డీఎంఏ) కింద లోన్ మారటోరియం అంశంపై కేంద్రానికి అధికారాలు ఉన్నాయని ఉన్నతన్యాయస్థానం గుర్తు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేసిన ఈఎంఐలపై వడ్డీని వసూలు చేయడాన్ని ఆపివేయడం లేదా మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీని వసూలు చేయడం వంటి వివిధ అంశాలపై నిర్ణయం తీసుకొని బ్యాంకులను ఆదేశించడానికి కేంద్రానికి అధికారాలు ఉన్నాయని తెలిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ కేంద్రం, ఆర్బీఐ ఈ అంశంపై కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. కేంద్రం తప్పించుకోవడం లేదని అత్యున్నతన్యాయస్థానం ముందు ఉంచారు. అదే సమయంలో లోన్ మారటోరియంపై వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం కేసును సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.లోన్ మారటోరియానికి సంబంధించి కేంద్రం, ఆర్బీఐ తన అభిప్రాయాన్ని వెల్లడించాలని జూన్ నెలలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా రుణాలుపై మారిటోరియం విధించినా వడ్డీలపై వడ్డీలను వసూలు చేయడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. వడ్డీ మాఫీ చేయవచ్చా లేదా తాత్కాలిక నిషేధ సమయంలో వచ్చే వడ్డీపై వడ్డీని వసూలు చేయడాన్ని ఆపివేయవచ్చా అనేది నిర్ణయించుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.
=

Related Posts