YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఎంపీనే బురిడీ కొట్టించిన మోసగాళ్లు

ఎంపీనే బురిడీ కొట్టించిన మోసగాళ్లు

హైద్రాబాద్, ఆగస్టు 27, 
కేటుగాడా..మజాకా అనిపించేలా ఓ ఘటన జరిగింది. ఏకంగా ఓ ఎంపీకే ఫోన్ చేసిన బురిడీ కొట్టించాలనుకున్నాడు మోసగాడు. మోసం చేయాలను ఆలోచన వచ్చింది. చేతిలో ఫోన్ ఉంది. దాంట్లో ఫోన్ నంబర్ ఉంది. ఇది చాలు మాయమాటలు చెప్పి మోసం చేయటానికి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా..తన తెలివితేటలకు పనిచెప్పాలనుకున్నాడు.తాను కేంద్ర పరిశ్రమల శాఖకు కార్యదర్శినంటూ మహేష్ అనే ఓ వ్యక్తి తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావుకు ఫోన్ చేశాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు లోన్లు ఇప్పిస్తామని రూ.25 లక్షల లోనుకు రూ.50వేలు సబ్సిటీ ఉంటుందని చెప్పాడు. అలా 25మంది నిరుద్యోగులను ప్రతిపాదించాలని సూచించాడు. దాని కోసం లోను తీసుకోవాలనుకున్న ప్రతీ నిరుద్యోగినుంచి రూ.1.25 లక్షలు బ్యాంక్ ఎకౌంట్ లో వేయాలని చెప్పేసరికి ఎంపీ కేకేకు అనుమానం వచ్చింది. అలా చివరి క్షణంలో అది మోసమని గ్రహించారు.దీంతో అతన్ని మాటల్లో పెట్టి..మీరు ఎక్కడున్నారు? ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారని ఆరా తీయగా..తాను ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ దగ్గర ఉన్నానని చెప్పాడు. దీంతో వెంటనే కేకే మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేయగా..నేను ఢిల్లీలో ఉన్నానని చెప్పారు. దీంతో తనకు ఫోన్ చేసింది మోసగాడని తెలిసింది కేకేకు. దీంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పారు.కానీ అప్పటికే ఆమోసగాడి వలలో ఓనిరుద్యోగి చిక్కుకున్నాడు. అఖిల్ అనే వ్యక్తి రూ. 50 వేలు మహేశ్ చెప్పినట్లుగా బ్యాంకు లో వేశాడు. దీంతో..తన పంట పడిందనుకుంటూ మహేశ్ నిజామాబాద్ జిల్లాలోని ఓ ఏటీఎం నుంచి రూ.45వేలు విత్ డ్రా చేసేసుకున్నాడు. సదరు మహేష్పై ఎంపీ కేకే బంజారాహిల్స్ పోలీసులకు ఫర్యాదు చేశారు. దయచేసి ఇటువంటి ఫోన్స్ ను ఎవ్వరూ నమ్మవద్దని ..తొందరపడి ఎవరూ డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. కేకే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మోసగాడిని పట్టుకునే పనిలో పడ్డారు

Related Posts