YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

యూరియా వినియోగం...రెట్టింపు

యూరియా వినియోగం...రెట్టింపు

అదిలాబాద్, ఆగస్టు 27, 
రాష్ట్రంలో ఎరువుల వినియోగం గణనీయంగా పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా వానాకా లం పంటలు సాగు విపరీతంగా పెరగడంతో ఈ స్థాయిలో డిమాండ్ పెరిగినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది. కోటి 25 లక్షల ఎకరాలు వ్యవసాయ పంటలకు తోడు ఉద్యాన పంటలు కలిపి మొత్తం కోటి 34 లక్షల 50 వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు ఉన్నట్లు పేర్కొంది. గతేడాది సాగైన విస్తీర్ణంతో పోలిస్తే దాదాపు 36.59 శాతం పంటల సాగు పెరిగిందని వివరించింది. దేశంలో నే ఈ స్థాయిలో వానాకాలం పంటల సాగు పెరిగిన రాష్ట్రాలతో చూస్తే తెలంగాణ మొదటి స్థానం లో ఉంది. ఆ తరువాత 36.01 శాతంతో జార్ఖండ్, 35.41 శాతంతో తమిళనాడు రాష్ట్రాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రధానంగా ఎరువులు అవసరమయ్యే వరి, పత్తి పంటలే కోటి ఎకరాల పైన తెలంగాణలో సాగయ్యాయి.దీంతో ఆగస్టులో యూరియాకు మరింత డిమాండ్ ఏర్పడింద ని వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి తెలిపారు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు కేం ద్ర ఎరువుల శాఖతో చర్చించి, కేటాయింపులు పెంచేలా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది వానాకాలంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు 23 వరకు జరిపిన ఎరువుల అమ్మకాలు, ఈ ఏడాది విక్రయాలతో చూస్తే ఏ మేరకు పెరిగిందనేది స్పష్టమౌతోంది. గత సంవతర్సం కేవలం 11.11 లక్షల మెట్రిక్ టన్నులే ఉండగా, ఈసారి అది 16.15 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. అంటే 45.36 శాతం పెరిగింది. ఇక యూరియా విషయానికొస్తే గత ఏడాది ఈ సమయానికి 4.50 లక్షల మెట్రిక్ టన్నులు అమ్ముడుపోగా, ఈసారి 7.10 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. మిశ్రమ ఎరువులైన నైట్రోజన్, ఫాస్పరస్, పోటాషియం (ఎన్‌పికె) వినియోగం కూడా ఎక్కువే ఉన్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది.సాగు విస్తీర్ణం పెరగడంతో ఎరువులకు, ప్రధానంగా యూరియాకు రైతులు ఎగబడుతున్నారు. కొరత వస్తుందనే భయంతో కొందరు ముందస్తుగా కొనుగోలు చేసి పెట్టుకున్నారు. దీంతో తాత్కాలికంగా గ్యాప్ ఏర్పడి కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని గ్రహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతులను అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో ఎరువులకు కొరత లేదని ఇప్పటికీ అందుబాటులో 77,505 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు తెలిపింది. అవసరం ఉన్న రైతులే కొనుగోలు చేయాలని సూచనలు చేసింది. ముందస్తుగా కొనుగోలు చేసిన వారు తక్షణ అవసరం ఉన్న రైతులకు వాటిని అందజేసి సహకరించాలని కోరింది.ఇప్పటికే 10,752 మెట్రిక్ టన్నులు వచ్చిందని, మరో 6 వేల మెట్రిక్ టన్నులు లోడింగ్, ట్రాన్సిస్ట్‌లో ఉందని తెలిపింది. అలాగే మరో 7570 మెట్రిక్ టన్నులు లోడింగ్ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. యూరియా కొనుగోలు చేసే రైతులు ఆ రోజు, ఆ తరువాతి రోజు అవసరాలకు మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. కరోనా నేపథ్యంలో క్యూ ఉండకూడదని మే నెలలో మాత్రమే ముందస్తు కొనుగోళ్లు చేయాలని సూచించినట్లు చెప్పారు. అలాగే భూసారం, పంటల వారీగా తగిన మోతాదులోనే వినియోగం ఉండాలని తెలిపారు. కరోనా నేపథ్యంలో బయో మెట్రిక్ లేదని, రైతులు ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డులు తీసుకువచ్చి ఎరువులు తీసుకోవాలన్నారు.

Related Posts