YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మొండి బకాయిల వసూలుకు ‘బ్యాడ్ బ్యాంక్’లు ఏర్పాటు

మొండి బకాయిల వసూలుకు ‘బ్యాడ్ బ్యాంక్’లు  ఏర్పాటు

న్యూ ఢిల్లీ ఆగష్టు 27 
వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం.. వాటిని తీర్చకుండా విదేశాలకు చెక్కేయడం.. చూసి చూసి బ్యాంకులు బకాయిలు వసూలు కాక వాటిని వదిలేయడం.. అప్పు తీసుకున్న  వారు  తప్పించుకోవడం.. ఇప్పుడు ఈ తంతు దేశంలో జరుగుతోంది. సామాన్యుడు లేదా రైతులు అప్పులు తీసుకుంటే ఇంటికొచ్చి మరీ ముక్కుపిండీ వసూలు ఇంటి తలుపులు తీసుకెళుతారు బ్యాంకు అధికారులు కానీ.. విజయ్ మాల్యా నీరవ్ మోడీ చోహ్లీ లాంటి వేల కోట్ల వారి వెంట్రుకను కూడా తాకలేరు. వారికి దాసోహం అయిపోతుంటారు. అందుకే దేశంలో మొండి బకాయిదారుల పీచమణిచేందుకు ‘బ్యాడ్ బ్యాంక్’ణు ఏర్పాటు చేయాలని తాజాగా ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బరావు కీలక సూచన చేశారు. దేశంలోని బ్యాంకులకు అంతకంతకూ పెరుగుతున్న నిరర్థక ఆస్తులను తగ్గించి ఆ బకాయిలను వసూలు చేయడం కోసం ఈ బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయడం తప్పనిసరి అని సుబ్బారావు వెల్లడించారు. మొండి బకాయిలకు ఈ బ్యాడ్ బ్యాంకులు సమర్థంగా పనిచేస్తాయని.. చాలా దేశాల్లో మంచి ఫలితాలు వచ్చాయని.. మన దేశంలోనూ అమలు చేయాలని ఆర్బీఐని కోరారు.బ్యాడ్ బ్యాంకులు అనేవి మొండి బకాయిలను వసూలు చేయడానికి వివిద దేశాల్లో ప్రభుత్వాలు అధికారికంగా ఏర్పాటు ఓ తరహా వసూలు చేసే సంస్థ. రిజర్వ్ బ్యాంకు దీన్ని ఏర్పాటు చేస్తే అది దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యంకుల నుంచి రుణాలు తీసుకొని వాటిని తిరిగి చెల్లించని వారి జాబితా సేకరించి ముక్కుపిండి వసూలు చేస్తుంది.దీంతో మొండి బకాయిదారులు వేల కోట్లను ఎగ్గొట్టకుండా కాపాడుతుంది.ఇప్పుడు ఈ బ్యాడ్ బ్యాంకును దేశంలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఆర్థిక రంగ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.

Related Posts