YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దూకుడు పెంచి సత్తా చాటిన సోనియా!

దూకుడు పెంచి సత్తా చాటిన సోనియా!

న్యూ ఢిల్లీ  ఆగష్టు 27 
సోనియా గాంధీ ఇదివరకటి దూకుడు ప్రదర్శించలేక పోతుందని ఆమె అధ్యక్షురాలిగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి ఇదే గతి తప్పదని ఆమె అధ్యక్ష పదవి నుండి దిగిపోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన 23 మంది లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖ పై వర్కింగ్ కమిటీ లో చర్చ కూడా జరిగింది. ఆ భేటీలో మరి  కొద్దిరోజుల పాటు ఆమె అధ్యక్షురాలిగా కొనసాగడానికి అందరూ మద్దతు తెలిపారు. ఈ పరిణామం చోటుచేసుకున్న కేవలం 48 గంటల్లోనే తన రాజకీయ చతురతని బయటపెట్టి తన దూకుడు చూపించింది. ఇంకా తన ఎత్తులకు పదును తగ్గలేదని నిరూపించింది. నీట్ జేఈఈలపై విద్యార్థుల ఆందోళనకు అనుకూలంగానూ జీఎస్టీ బకాయిలపైనా విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలను కూడగట్టడం ద్వారా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ దూకుడు ప్రదర్శించారన్న అభిప్రాయాలు అందరిలో ఉత్పన్నం అవుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ సమస్యలను పరిష్కరించేందుకు మోదీ సర్కారుపై సమష్టిగా పోరాడాలని ఏడు  రాష్ట్రాల సీఎంల సమావేశంలో పిలుపిచ్చారు. ఈ భేటీ జరగడంతో  ఇప్పటికీ క్రియాశీల నేతనేనని ప్రజాక్షేత్రంలో పనిచేసే నాయకురాలినని తక్కువగా అంచనా వేయొద్దని అసమ్మతి నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారని చర్చిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోతలచుకుంటే కొన్ని గంటల్లోనే  విపక్షాలను ఏకం చేయగల సత్తా ఉందని సంకేతాలను అన్నిపార్టీలకూ ఇచ్చారని అభిప్రాయ పడుతున్నారు.
వామపక్షాలు తృణమూల్ డీఎంకే శివసేన ఆర్జేడీ జేఎంఎం.. మొదలైన భావసారూప్య పార్టీలను కలుపుకుపోతామని కాంగ్రెస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ఉమ్మడి గళం వినిపిద్దామని  ముఖ్యమంత్రులకి సోనియా ఓ పిలుపునిచ్చారు. బిహార్ బెంగాల్ రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న వేళ ఆమె చొరవ రాజకీయంగా చాలా కీలకం కానుంది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లోకాంగ్రెస్ కి అంతగా పట్టులేదు. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఆర్జేడీ కూటమిల గెలుపు కేంద్రస్థాయిలో కాంగ్రెస్ కి లాభమే అని కాంగ్రెస్ అంచనా వేస్తుంది. ప్రస్తుతం దేశంలో మోడీ పాపులారిటీ   పెరిగినట్లు సర్వేలు సూచిస్తున్న  సమయంలో విపక్షాలు మోడీ  సర్కారు పై  యుద్ధం ప్రకటించాయి. ఇది ఆరంభం మాత్రమేనని కరోనా వ్యాప్తి తగ్గితే ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలోకి సమష్టిగా వెళతామని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.

Related Posts