అమరావతి ఆగష్టు 27
ఏపీ మూడు రాజధానుల వ్యవహారం ఏపీ హైకోర్టులో తేలడం లేదు. రాజధాని మార్పుపై దాఖలైన పిటీషన్లను హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే వచ్చే నెల 21 నుంచి రోజువారీ విచారణపై న్యాయవాదులతో ధర్మాసనం చర్చించింది. రాజధానిపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఇవాళ్టితో ముగిసింది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన హైకోర్టు సెప్టెంబర్ 21 వరకు స్టేటస్ కో అమలు గడువును పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. రాజధాని బిల్లులు అమలు చేయకుండా ఈ స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది. ఇక విశాఖలో భారీ అతిథిగృహాన్ని సర్కార్ నిర్మిస్తోందని.. రాజధాని తరలింపు లేకుండా ఈ అతిథి గృహం నిర్మాణం ఏంటని లాయర్ నితీష్ గుప్తా వాదించగా.. దీనిపై వివరణ ఇవ్వాలని కౌంటర్ దాఖలుకు సెప్టెంబర్ 10వరకు సర్కార్ కు గడువు ఇచ్చింది.