కడప ఆగష్టు 27
పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్ల విధి నిర్వహణలో అవసర నిమిత్తం పలు రకాల వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఆ క్రమంలో భాగంగా ఈ రోజు కడప జిల్లా బద్వేలు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిశా పోలీస్ స్టేషన్ విభాగంలో పని చేస్తున్న మహిళా కానిస్టేబుళ్ల కొరకు నాలుగు హోండా యాక్టివా వాహనాలను ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి కొనుగోలు చేసి అందజేశారు. నాలుగు వాహనాలను బద్వేల్ పోలీసు స్టేషన్లో అందజేయడం కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ పాల్గొన్నారు. సభలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ మహిళలు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుక్కు పోయినప్పుడు వెంటనే 112డయల్ చేసినా వెంటనే పోలీసులు వచ్చి సంబంధిత మహిళలను రక్షించేందుకు పోలీసులు దిశా పోలీస్ స్టేషన్ నందు సిద్ధంగా ఉంటారన్న విషయాన్ని ప్రతి మహిళా గుర్తుపెట్టుకోవాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు పోలీస్ స్టేషన్లోని మహిళా కానిస్టేబుళ్లు, పట్టణంలోని వార్డు కానిస్టేబుళ్లు తో పాటు సచివాలయంలోని మహిళా సిబ్బంది మరియు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అయితే ఈ కార్యక్రమం మంచి ఆలోచనతో తలపెట్టినప్పటికీని కారొనా సమయంలో ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఇంతమంది జనం ఒకే చోట గుమికూడడం సరైన పద్ధతేనా అంటూ పట్టణ ప్రజలు విమర్శలు చేయడం విశేషం.