YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

కరోనాకు‘ఆల్‌ ఇన్‌ వన్‌' వ్యాక్సిన్‌!

కరోనాకు‘ఆల్‌ ఇన్‌ వన్‌' వ్యాక్సిన్‌!

లండన్‌ ఆగష్టు 27 
కరోనాతోపాటు ఆ జాతికి చెందిన అన్ని రకాల వైరస్‌లను ఎదుర్కొనే టీకాను తయారు చేయటానికి కృషి చేస్తున్నామని ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జి యూనివర్సిటీ తెలిపింది. కరోనా జాతికి చెందిన అన్ని రకాల వైరస్‌ల జన్యుక్రమాలను ఉపయోగించి డీఐవోఎస్‌-కోవాక్స్‌2 అనే వ్యాక్సిన్‌ను ఇప్పటికే అభివృద్ధి చేశామని, దానిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉన్నదని బుధవారం వెల్లడించింది. ట్రయల్స్‌ విజయవంతమైన తర్వాత.. రోగులకు నొప్పి కలుగకుండా ‘స్ప్రింగ్‌ పవర్డ్‌ జెట్‌ ఇంజిక్షన్‌' (సూది లేకుండా టీకాను శరీరంలోకి ఎక్కించడం) ద్వారా ఈ టీకాను వేస్తామని తెలిపింది. ‘కొవిడ్‌-19 వైరస్‌ నిర్మాణాన్ని 3డీ కంప్యూటర్‌ మోడలింగ్‌ ద్వారా విశ్లేషించి టీకాను అభివృద్ధి చేశాం. భవిష్యత్‌లో జంతువుల నుంచి మానవులకు సోకే అవకాశమున్న సార్స్‌, మెర్స్‌ వంటి కరోనా జాతి వైరస్‌ రకాలను కూడా కట్టడి చేసేలా ఈ టీకాను అభివృద్ధి చేశాం. దీని కోసం ఆయా వైరస్‌ జన్యు క్రమాలను కూడా విశ్లేషించాం’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ జోనథాన్‌ హీనే తెలిపారు. సింథటిక్‌ డీఎన్‌ఏ, 3డీ కంప్యూటింగ్‌ సాంకేతికత సాయంతో అభివృద్ధి చేసిన తమ వ్యాక్సిన్‌ అన్ని రకాల కరోనా వైరస్‌లను కట్టడి చేయగలుగుతుందని ఈ పరిశోధనలో పాల్గొన్న మరో శాస్త్రవేత్త డాక్టర్‌ రెబెకా కిన్స్‌లే తెలిపారు. అత్యంత తక్కువ ధరలోనే టీకాను అందుబాటులోకి తెస్తామన్నారు.

Related Posts