YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తెలంగాణ మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు

తెలంగాణ మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు

సూర్యాపేట ఆగష్టు 27 
గత పాలకుల హయాంలో ఆదరణ కోల్పోయిన కుల వృతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణం పోశారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కాళేశ్వరం ఆయకట్టు చివరి చెరువు అయిన  పెన్ పహాడ్ మండలం మాచారం గ్రామంలో ని రావి చెరువు తో పాటు తన దత్తత గ్రామం అయిన చీదేళ్ల పెద్ద చెరువు  రెండు లక్షల  చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ..కుల వృత్తులను ప్రోత్సహించడంలో భాగంగానే ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఉచితంగా 80 కోట్ల చేప పిల్లలు, 5 కోట్ల రొయ్య పిల్లలను చెరువుల్లో వేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. సముద్ర తీర ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం లేదన్న మంత్రి..అట్లాంటి రాష్ట్రాలతో మత్స్యసంపదలో పోటీపడి నీలి విప్లవం వైపు పయనిస్తున్నామన్నారు.

Related Posts