అమరావతి ఆగష్టు 27
ప్రైవేట్ల్యాబ్లలో కరోనా నిర్ధారణ పరీక్షల ధరలు తగ్గాయి. గతంలో రూ. 2,900 ఉన్న స్వాబ్ టెస్ట్ ధరను రూ. 1900లకు తగ్గింది. ప్రభుత్వం పంపించే శాంపిల్స్ టెస్టింగ్ ధర రూ. 2,400 నుంచి రూ. 1600కు తగ్గింది. కరోనా నిర్ధారణ కిట్ల తయారీ పెరగడంతో ప్రభుత్వం ధరలు తగ్గించింది. ఎక్కువమంది అనుమానితులకు పరీక్షలు అందుబాటులో ఉండాలని రేట్లు తగ్గించినట్లు పేర్కొంది. అన్ని జిల్లాల వైద్యారోగ్యశాఖాధికారులు ప్రైవేట్ ల్యాబ్ల ధరలపై పర్యవేక్షణ ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.