YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

మోడీకు ఓటు వేస్తున్న చైనీయులు

మోడీకు  ఓటు వేస్తున్న చైనీయులు

న్యూఢిల్లీ, ఆగస్టు 27 
గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోగా.. చర్చలు సైతం సరైన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నిస్తే.. ఏ భారతీయుడైనా మండిపడతాడు. కానీ చైనాలో మాత్రం మోదీ సర్కారు పట్ల సానుకూలత వ్యక్తం కావడం విశేషం. చైనా ప్రభుత్వ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడి కావడం గమనార్హం.చైనా ప్రజల్లో దాదాపు 50 శాతం మంది మోదీ ప్రభుత్వాన్ని పొగుడుతుండగా... మరో 50 శాతం మంది మాత్రం చైనా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. అంతే కాదు భారత్‌లో చైనా వ్యతిరేకత పెరిగిందని 70 శాతం మంది చైనీయులు భావిస్తున్నారు. మరో 30 శాతం మంది మాత్రం ఇరు దేశాల మధ్య సంబంధాలు భవిష్యత్తులో మెరుగవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం అనేది దీర్ఘకాలికం కాబోదని 9 శాతం మంది అభిప్రాయపడగా.. 25 శాతం మంది మాత్రం.. దీర్ఘకాలంలో భారత్, చైనా సంబంధాలు బలపడతాయని భావిస్తున్నారు.భారత్‌కు చైనీయులు వ్యతిరేకం కాదనే సంకేతాలను మోదీ సర్కారుకు పంపడం కోసం చైనా ఈ సర్వే వివరాలను వెల్లడించి ఉంటుందనే భావన వ్యక్తం అవుతోంది. గల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన తర్వాత చైనా కంపెనీలపై మోదీ సర్కారు కొరడా ఝలిపిస్తోంది. హువావే సహా పలు చైనీస్ సంస్థలతో సంబంధాలను దశల వారీగా ముగించాలని భారత్ భావిస్తోంది. ప్రభుత్వం అధికారికంగా నిషేధం విధించకపోయినా.. మన దేశంలోని టెలీకాం సంస్థలు చైనా పరికరాలను ఉపయోగించొద్దని ప్రభుత్వం సూచించిందిఈ ప్రభావం తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో చైనాకు చెందిన అతిపెద్ద టెక్నాలజీ సంస్థ హువావే.. భారత్‌‌ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. మన దేశంలోని అన్ని ప్రధాన దిన పత్రికల్లో ప్రకటనలు గుప్పిస్తోంది. భారత్‌తో తమకు ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయని.. ఇండియా ప్రయోజనాల కోసం తాము కట్టుబడి ఉన్నామని హువావే సంకేతాలిస్తోంది.అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో హువావే ఇప్పటికే నిషేధం ఎదుర్కొంటోంది. ఈ టెక్ సంస్థపై న్యూజిలాండ్‌ సైతం పాక్షిక నిషేధం విధించింది. ఇరాన్ ఆంక్షలను ఉల్లంఘించారనే కారణంతో హువావే సీఎఫ్ఓ మెంగ్ వెంఝౌను కస్టడీలోకి తీసుకోవాలని అమెరికా భావిస్తోంది. కెనడా, చైనా మధ్య దౌత్య యుద్ధం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌లో తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి హువావే ప్రయత్నిస్తోంది.

Related Posts