YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీకి మరో షాక్

టీడీపీకి మరో షాక్

రాజమండ్రి, ఆగస్టు 28, 
తెలుగుదేశం పార్టీకి తూర్పుగోదావరి జిల్లాల్లో మరో గట్టి షాక్ ఇచ్చింది వైసిపి. ఆ పార్టీ లో తొలి నుంచి ఉన్న మాజీ ఎమ్యెల్యే చందన రమేష్ తన కుమారుడు నాగేశ్వర్ తో సహా వైసిపి తీర్ధం పుచ్చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో వైఎస్ ప్రభంజనంలో రాజమండ్రి టూ గా ప్రస్తుతం ఉన్న కడియం నియోజకవర్గం నుంచిచందన రమేష్ మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు సతీమణి విజయలక్ష్మి పై విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో టిడిపి తూర్పు గోదావరి జిల్లా నుంచి గెలిచిన కొద్ది సీట్లలో కడియం స్థానం ఒకటి కావడం విశేషం. ఆ తరువాత ఐదేళ్లపాటు ప్రతిపక్షం లో ఉన్నా మచ్చ లేకుండానే చందన రమేష్ రాజకీయాల్లో కొనసాగారు.బడా వ్యాపారవేత్తగా, దాతగా వస్త్ర వ్యాపారంలో పేరు ప్య్రఖ్యాతులు పొందిన చందన రమేష్ కి బిసి సామాజిక వర్గంలో గట్టి పట్టు ఉంది. అలాగే చేనేత వర్గానికి చెందిన కులాల్లో తిరుగులేని అభిమానం చందన రమేష్ సంపాదించుకున్నారు. అలాంటి రమేష్ 2014 ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడం ఆ తరువాత చివరి నిమిషంలో టికెట్ ఆశించినా సినీయర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ని రాజమండ్రి వన్ నుంచి టూ కి మార్చడంతో ఆయన రాజకీయాలకు దూరం జరిగారు. తిరిగి 2019 లో చందన రమేష్ తన కుమారుడికైనా చంద్రబాబు టికెట్ ఇస్తారని ఆశించినా ఫలితం లేకుండా పోయింది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే చందన రమేష్ వైసిపి లోకి ఎంట్రీ ఇస్తారని టిడిపి ఊహించలేదు.అయితే రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్ వత్తిడి చేయడంతో చందన రమేష్ తన తనయుడితో సహా జగన్ సమక్షంలో వైసిపి లోకి వచ్చేయడం టిడిపి కి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇది ఇలా ఉంటె చందన రమేష్ కి జగన్ భవిష్యత్తుపై భరోసా కల్పించడంతోనే ఆయన సుదీర్ఘ కాలం ఉన్న టిడిపి కి గుడ్ బై కొట్టినట్లు ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం జగన్ యూత్ వైపే చూస్తున్నారు. తన కుమారుడు నాగేశ్వర్ కి రాజకీయ భవిష్యత్తు కి వైసిపి చీఫ్ రెండు ఆఫర్లు ఇచ్చినట్లు ప్రచారం సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి వన్ లేదా టూ నియోజకవర్గాల్లో ఎదో ఒక చోటి నుంచి అసెంబ్లీ టికెట్ ఇస్తానని లేదా కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో కూడా ఛాన్స్ ఇచ్చేందుకు ఈక్వేషన్స్ ను బట్టి చూస్తా అన్నట్లు సమాచారం. మరో పక్క ఇటీవల కులాల వారీగా ప్రకటిస్తున్న కార్పొరేషన్ ఛైర్మెన్ లలో ఆసక్తి ఉంటే పదవి ఇవ్వడానికి ఫ్యాన్ పార్టీ రెడీ అయ్యిందంటున్నారు. చందన రమేష్ కుమారుడు నాగేశ్వర్ కి వచ్చే రోజుల్లో లభించే పదవిని బట్టి అసలు ఆఫర్ ఏమిటన్నది తేలుతుంది.

Related Posts