YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఈసీకి బీహార్ కష్టాలు

ఈసీకి బీహార్ కష్టాలు

పాట్నా, ఆగస్టు 28, 
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. బీహార్ రాష్ట్ర పరిస్థితి అందరికీ తెలిసిందే. అభివృద్ధికి దూరంగా అనేక ప్రాంతాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కరోనా వైరస్ కూడా బీహార్ లో మామూలుగా లేదు. ఈ పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు బీహార్ లో నిర్వహించడం కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఒక సవాల్ గా మారిందనే చెప్పాలి.బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరులోపు జరగాల్సి ఉంది. నవంబరు 29వ తేదీతో బీహార్ ప్రభుత్వం గడువు ముగుస్తుంది. ఒకవైపు కరోనా వైరస్ మరో వైపు వరదలు బీహార్ ను అతలాకుతలం చేశాయి. అయితే అన్ని పార్టీలూ బీహార్ ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి. విజ్ఞప్తులు చేశాయి. ప్రధాన రాజకీయ పార్టీ ఆర్జేడీతో సహా అన్ని పార్టీలూ కోరినా ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికలు జరిపేందుకే సిద్ధమయింది.అందతున్న సమాచారం ప్రకారం అక్టోబరు 20వ తేదీన  బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశముంది. అయితే ఇందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అభ్యర్ధులు నామినేషన్లను ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేయాలి. డిపాజిట్ సొమ్మును కూడా ఆన్ లైన్ లోనే చెల్లించాలి. ఇక పాత పద్ధతిలోనే ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషన్ డిసైడ్ అయింది. బ్యాలట్ పత్రాలు పెట్టాలని విపక్షాలు కోరినప్పటికీ ఈవీఎంల ద్వారానే ఎన్నికలను నిర్వహించనుంది.ఈవీఎంల వద్ద కూడా కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనుంది. ముందుగా ప్రతి ఓటరుకు ఓటు వేసే ముందు శానిటైజర్ ఇస్తారు. అలాగే గ్లౌజ్ లు ధరించి మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ధర్మల్ స్క్రీనింగ్ యంత్రాలను కూడా పెట్టనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద సోషల్ డిస్టెన్స్ ను మెయిన్ టెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక అభ్యర్థుల ప్రచారానికి కూడా నిబంధనలను విధించింది. అభ్యర్థితో పాటు ఐదుగురు మాత్రమే ఇంటింటి ప్రచారం చేయాలి. భారీ సభలు పెట్టేందుకు వీలులేదు. ఇలాంటి నిబంధనలతో కోట్లాది మంది ఓటర్లను ఎన్నికల కమిషన్ కట్టడి చేయగలదా? అన్న ప్రశ్న తలెత్తుంది. ఎన్నికలు సకాలంలో జరపకుంటే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందన్నది ఎన్నికల సంఘం అభిప్రాయం. మరి కరోనా సమయంలో తొలిసారి జరగనున్న బీహార్ ఎన్నికలు ఎన్నికల సంఘం ఎలా నిర్వహిస్తుందన్నది ప్రశ్నార్థకమే.

Related Posts