YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

టీడీపీ కలిసొస్తే...హోదా సాధ్యమే

టీడీపీ కలిసొస్తే...హోదా సాధ్యమే

ఏపీ విభజన హామీల అమలుపై కేంద్రం వైఖరికి నిరసనగా ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్‌నకు టీడీపీ, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం విశాఖపట్నంలో జరిగిన బంద్‌లో వైసీపీ ఎంపీ విజయ్‌సాయి రెడ్డి పాల్గొన్నారు.  ఏపీలోని 25 మంది లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేసి, ప్రత్యేక ప్యాకేజీ అడగకపోయింటే కేంద్రం దిగొచ్చేదని అన్నారు. గతంలో 2014 మార్చి 2 న ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ క్యాబినెట్ చేసిన తీర్మానం లాలూచీ రాజకీయాల అమలు కాలేదని, దీని వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. ‘అఖిల పక్షాల బంద్‌కు పిలుపునిస్తే దీనిపై సీఎం ఓ చెత్త స్టేట్‌మెంట్ ఇచ్చారు.. బంద్ రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడదని, దీని వల్ల ప్రయోజనం ఉండదని సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు.. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎన్ని బంద్‌లకు పిలుపునిచ్చిందో గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. బంద్‌పై తాను చంద్రబాబు బాబు సూటిగా ప్రశ్నిస్తూ.. 1885లో అఖిల భారత కాంగ్రెస్ ఆవిర్భావం తర్వాత అందులోని మితవాదులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రే, టిషన్, ప్రొటెస్ట్ అనే విధానం అనుసరించారు.. భారతీయ సంస్కృతిలో భాగంగా వెల్లివిరిసిన అటువంటి సిద్ధాంతాన్ని ఏదో నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలపండి అంటే ఏదైనా సాధించగలమా.. ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా ఉన్న నిరసన తెలపకుండా ఏదీ సాధించలేం’ అని విజయ్‌సాయి విమర్శించారు. చంద్రబాబు తన ద్వంద్వ వైఖరి విడనాడాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమైన నిరసన చేయకుండా ఏదీ సాధించలేం... అవినీతిని ప్రోత్సహిస్తాడు.. బంద్‌ను మాత్రం వ్యతిరేకిస్తాడు’ అంటూ విజయ్‌సాయి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు

Related Posts