అసిఫాబాద్ ఆగష్టు 28
ఆసిఫాబాద్ మండలం ఇటిక్యాల గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రత మిషన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ రైతులకు శిక్షణ మరియు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు . రైతులు సమతుల్యత ఎరువులను వాడాలని జిల్లా వ్యవసాయాధికారి రవీందర్ సూచించారు .
ఒక ఎకరం పత్తి పంటకు గాను పంట కాలంలో 100 కిలోల యూరియా , 50 కిలోల డీఏపీ, 50 కిలోల పోటాష్ ఎరువులను మాత్రమే వాడాలన్నారు. పత్తి పంటలో ప్రధాన సమస్య అయిన రసం పీల్చు పురుగులను నివారించుటకు రైతులు వివిధ రకాల పురుగు మందులు, అదిక మోతాదులల్లో వాడుతున్నరని , దానికి బదులుగా మోనోక్రోటోఫాస్ మరియు నీరు ను 1:4 నిష్పత్తిలో కలుపుకొని కాండంపై పూత పూయడం వలన అన్ని రకాల రసం పీల్చే పురుగుల ఉధృతి నుండి తక్కువ ఖర్చుతో పంట, పర్యావరణ ఆరోగ్యాన్ని కూడా కాపాడటం జరుగుతుందన్నారు . కాండం పూత క్షేత్ర ప్రదర్శనను రైతు చౌదరి పెంటు చేనులో నిర్వహించారు .ఈ కార్యక్రమంలో అసిఫాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు మిలింద్ కుమార్ , మండల వ్యవసాయాధికారి ఖాదర్ హుస్సేన్, ఎఇఓలు అపర్ణ , రాము , గ్రామ రైతులు కిష్టయ్య, పెంటు , విజయ్ తదితరులు పాలుగున్నారు.