YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కోయిలకుంట్ల లో ఎరువుల దుకాణాలలో తనిఖీలు రూ.72 లక్షల విలువైన కాంప్లెక్స్ అక్రమ ఎరువుల గుర్తింపు

కోయిలకుంట్ల లో ఎరువుల దుకాణాలలో తనిఖీలు  రూ.72 లక్షల విలువైన కాంప్లెక్స్  అక్రమ ఎరువుల గుర్తింపు

కర్నూలు ఆగష్టు 28 
కర్నూలు జిల్లా కోయిలకుంట్ల పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలపై జిల్లా వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణంలో  వివిధ కంపెనీలకు చెందిన యూరియా , అమ్మోనియా, డి ఏ పి ,వంటి పలురకాల అక్రమంగా నిల్వ ఉంచిన రూ.72 లక్షల విలువైన 375 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.  వ్యవసాయ పనుల సీజన్ ప్రారంభం కావడంతో  ఫర్టిలైజర్స్ షాపులు యజమానులు  పలు ప్రాంతాల్లో ఇప్పటికే కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టించి నిర్ణీత ధరల కంటే  అధికంగా  కాంప్లెక్స్ ఎరువుల ధరలను బస్తా కు రూ.100 నుంచి 150 ధరలు పెంచి లక్షలాది రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే కోవ లోనే స్థానిక ఫర్టిలైజర్స్ వ్యాపారులు కూడా అక్రమాలకు తెర లేపి నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.  రైతులు ఎరువులు కొనేముందు తమ ఆధార్ కార్డు ని ఫర్టిలైజర్స్ దుకాణాలకు అందజేయాలని అధికారులు సూచించారు బిల్లు లేకుండా తెల్ల కాగితాల పైన రాసి ఇచ్చినట్లయితే స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో కానీ వ్యవసాయ అధికారులు గాని సమాచారం ఇచ్చినట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకొని షాపును సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.

Related Posts